Homeఎంటర్టైన్మెంట్Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తే.. వీటిని ఎలాంటి ఖర్చు లేకుండా ఓటీటీల ద్వారా వీక్షించడంతో సినిమా ఇండస్ట్రీ పడిపోయిందని అన్నారు. కానీ ఇప్పుడు వెండితెరకు పూర్వ వైభవం వస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తున్నారు. కొన్ని థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే పెద్ద సినిమా థియేటర్లు పూర్వ వైభవం రావడానికి ఇదే కారణం అని అంటున్నారు..అదేంటి మరి..

ఒక సినిమా సక్సెస్ వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. కొందరు సినిమా హీరోను చూసి రావొచ్చు.. మరికొందరు సాంగ్స్ నచ్చి లైక్ చేయొచ్చు.. ఇంకొందరు విజువల్స్ కు టెంప్ట్ కావొచ్చు.. కానీ ఏ సినిమా అయినా కంటెంట్ లేకుంటే డిజాస్టరే.. అని ఈ రోజుల్లో తేలిపోతుంది. ఓటీటీ మూవీ అయినా.. పెద్ద సినిమా అయినా.. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఇష్టపడుతారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. వందల కోట్ల ఖర్చు పెట్టిన సినిమాల్లో విషయం లేకపోతే బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. ఏమాత్రం ఖర్చు లేని ‘బలగం’ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి.

కొన్ని సినిమాలు థియేటర్లకు రాకుండా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా పరిశ్రమకు పెద్ద దెబ్బ పడిన విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఓటీటీల్లోనూ విషయం లేని సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదనే విషయం అర్థమవుతోంది. కంటెంట్ లేకుంటే ఓటీటీని కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ షేర్లు గత 12 నెలల్లో 42 శాతానికి పడిపోయాయి. ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకునే సినిమా లేకపోవడంతో దీనిని ఎవరూ సందర్శించడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితి మిగతా సంస్థల్లో కూడా ఉన్నట్లు సమాచారం.

ఇదే సమయంలో పెద్ద థియేటర్లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇటీవల కంటెంట్ ఉన్న సినిమాలు ఏకంగా థియేటర్లలో రిలీజ్ అవున్నాయి. ‘అబ్సెషన్’ అనే సినిమా తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ ఇందులో మంచి కంటెంట్ ఉండడంతో క్యూ కడుతున్నారు. ఈ సినిమాను రూ.10 కోట్లతో తీస్తే.. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. మరో వైపు ఇతర భాషా చిత్రాలనూ ఆదరిస్తున్నారు. ఇటీవల విడుదలయిన ‘ది ఒడిస్సీ’ కోసం సినీ జనం ఎగబడుతున్నారు. ఇవే కాకుండా లెనిన్ తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ విధంగా కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ కింగ్ లాగా ఉంటాయని కొందరు కొనియాడుతున్నారు. ఇప్పటికైనా జనాలకు నచ్చే సినిమాలు ఉండాలని కోరుకుంటున్నారు. అప్పుడే థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...
Vivo T5e

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Narendra Modi And Rahul Gandhi

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...
Electricity Complaint Number

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....
Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Oktelugu Epaper