బామ్మర్ది బాలయ్యకు చంద్రబాబు ప్రమోషన్

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లున్నారు. పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. తాజాగా.. చంద్రబాబు పార్టీ సెంట్రల్ కమిటీలను ప్రకటించారు. 25 మందితో జంబో కమిటీని ప్రకటించగా.. ఇందులో చంద్రబాబు బామ్మర్ది అయిన బాలయ్యకు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్‌ కల్పించారు. మరోవైపు ఇటీవల పొలిట్‌ బ్యూరో పదవికి రాజీనామా చేసిన గల్లా అరుణకుమారిని కూడా అందలం ఎక్కించారు. ఏకంగా సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవిని అప్పజెప్పారు. మొత్తంగా పార్టీని వెన్నంటి పెట్టుకొని […]

Written By: NARESH, Updated On : October 19, 2020 3:58 pm
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లున్నారు. పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. తాజాగా.. చంద్రబాబు పార్టీ సెంట్రల్ కమిటీలను ప్రకటించారు. 25 మందితో జంబో కమిటీని ప్రకటించగా.. ఇందులో చంద్రబాబు బామ్మర్ది అయిన బాలయ్యకు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్‌ కల్పించారు. మరోవైపు ఇటీవల పొలిట్‌ బ్యూరో పదవికి రాజీనామా చేసిన గల్లా అరుణకుమారిని కూడా అందలం ఎక్కించారు. ఏకంగా సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవిని అప్పజెప్పారు. మొత్తంగా పార్టీని వెన్నంటి పెట్టుకొని ఉంటున్న వారికే పెద్ద పీట వేశారు.

Also Read: మద్య నిషేధంపై జగన్‌ యూటర్న్‌..?

పొలిట్‌బ్యూరోలో చంద్రబాబు భారీ మార్పులు చేశారు. పార్టీ సీనియర్లతో పాటు జూనియర్లకూ అవకాశం కల్పించారు. హరికృష్ణ తర్వాత నందమూరి కుటుంబానికి ఇంతవరకు ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు బాలయ్యకు ప్రమోషన్‌ రావడంతో అందరిలోనూ ఆనందం వెల్లువెత్తుతోంది. ఇక బొండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనితలకు కూడా చంద్రబాబు పొలిట్‌బ్యూరోలో అవకాశం ఇచ్చారు. అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షుడి హోదాలోకి వెళ్లడంతో ఆయన్ను పొలిట్ బ్యూరో నుంచి తప్పించారు. అలాగే పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దొరికింది. అలాగే మరికొందరు కొత్తవాళ్లకు కూడా చంద్రబాబు స్థానం కల్పించారు.

చంద్రబాబు లోకేష్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. సెంట్రల్ కమిటీలో కూడా సీనియర్లు, జూనియర్లకు సమాన అవకాశం కల్పించారు. ఏపీ, తెలంగాణ నేతలకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. అయితే.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి విషయంలో ఎలాంటి మార్పు జరగలేదు. ఎల్.రమణనే అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. ఏపీలో కళా వెంకట్రావు స్థానంలో మాత్రం అచ్చెన్నాయుడికి ఛాన్స్ ఇచ్చారు.

Also Read: డిసెంబర్ 25కు చూడండి ఏం జరుగుతుందో?: రఘురామ సంచలన వ్యాఖ్యలు

* టీడీపీ కొత్త పొలిట్‌బ్యూరో ఇదీ..
యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్‌గజపతి రాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమామహేశ్వరరావు, ఎన్‌ఎండీ ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్.

నారా లోకేష్ (జాతీయ అధికార ప్రతినిధి, ఎక్స్ అఫిషియో మెంబర్)
కింజారపు అచ్చెన్నాయుడు (ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎక్స్ అఫిషియో మెంబర్)
ఎల్.రమణ (తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, ఎక్స్ అఫిషియో మెంబర్)