బంగాళాఖాతంలో మరో అల్పపీడం బలహీనపడుతుండడంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ అన్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించేందుకు తక్షణమే 100 మంది సీనియర్ అధికారులను ప్రత్యేక ఆఫీసర్లుగా నియమించాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు.సోమవారం ఆయన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోతట్లు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజల ఆశ్రయం కోసం సామాజిక భవనాలు సిద్ధంగా ఉంచాలని కోరారు. నిరాశ్రయులకు అన్నపూర్ణ భోజనం అందించాలన్నారు.