BJP Janasena: ఆత్మకూరులో బీజేపీ ఒంటరిపోరు.. జనసేనతో పొత్తు పొడుపు నిలుస్తుందా? లేదా?

BJP Janasena: పాలు నీళ్లలా కలిసిపోతాయనుకున్న ఆ రెండు పార్టీలు ఎన్నికల వరకూ వచ్చేసరికి విడిపోతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతున్నాయి. బయటకు పొత్తులంటూ చెబుతూ కలిసి పోరాడాల్సిన టైంలో వేర్వేరుగా సాగుతున్నాయి. రాజకీయం అయినా.. సరే ఎన్నికలైనా సరే ఎవరిది దారి వారిదే అన్నట్టుగా వెళ్లిపోతున్నాయి. మరీ ఈ మాత్రానికి పొత్తు ఎందుకన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఆ రెండు పార్టీలు మరేవో కావు.. జనసేన-బీజేపీ. ఏపీ రాజకీయాల్లో పొత్తులతో ఏకమైన జనసేన, బీజేపీలు […]

Written By: NARESH, Updated On : June 4, 2022 8:25 pm
Follow us on

BJP Janasena: పాలు నీళ్లలా కలిసిపోతాయనుకున్న ఆ రెండు పార్టీలు ఎన్నికల వరకూ వచ్చేసరికి విడిపోతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతున్నాయి. బయటకు పొత్తులంటూ చెబుతూ కలిసి పోరాడాల్సిన టైంలో వేర్వేరుగా సాగుతున్నాయి. రాజకీయం అయినా.. సరే ఎన్నికలైనా సరే ఎవరిది దారి వారిదే అన్నట్టుగా వెళ్లిపోతున్నాయి. మరీ ఈ మాత్రానికి పొత్తు ఎందుకన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఆ రెండు పార్టీలు మరేవో కావు.. జనసేన-బీజేపీ.

ఏపీ రాజకీయాల్లో పొత్తులతో ఏకమైన జనసేన, బీజేపీలు ఎన్నికలు, ప్రజాందోళనలు అనేసరికి మాత్రం ఒక్కటిగా సాగడం లేదన్న ఆవేదన ఆ పార్టీ శ్రేణులు , నేతల్లో వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీచేసింది. ఆ తర్వాత బద్వేలులో జనసేనను సంప్రదించకుండా బరిలోకి దిగింది. పవన్ కళ్యాణ్ ఇక్కడ చనిపోయిన వైసీపీ అభ్యర్థి కుటుంబానికి మద్దతు పలికి వారిపై పోటీ నిలబెట్టవద్దని పిలుపునిచ్చాడు. పవన్ మాట కు విలువనిచ్చి టీడీపీ వైదొలగగా.. ధిక్కరించి బీజేపీ పోటీచేసింది. అప్పుడే జనసేన, బీజేపీ పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందన్న చర్చ సాగింది.

తాజాగా పవన్ కళ్యాణ్ తో సంప్రదించకుండానే ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో బీజేపీ దిగిపోయిందన్న ప్రచారం సాగింది. జనసేనతో సంబంధం లేకుండానే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా భరత్ కుమార్ అనే అభ్యర్థిని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్వయంగా ఈ ఎన్నికల బాధ్యతలు తీసుకొని భరత్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నాను. బీసీ వర్గానికి చెందిన భరత్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ అందరి సంపూర్ణ మద్దతు కోరారు. కానీ జనసేన మద్దతు మాత్రం ఇప్పటికీ అడగకపోవడం గమనార్హం. భరత్ కుమార్ ను గెలిపించాలని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను కోరుతూ అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నిజానికి జనసేన పోటీచేయాలని అందరూ అనుకున్నారు. కానీ బీజేపీ మాత్రం జనసేనతో సంప్రదించకుండానే ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి పోటీచేస్తోంది. ఇక్కడ పోటీ విషయంపై జనసేనలో , పవన్ కళ్యాణ్ లో ఇప్పటివరకూ కదలిక లేదు. బీజేపీ అభ్యర్థిగా మద్దతు కూడా పవన్ ఇవ్వలేదు. ఇటు బీజేపీ అడగడం లేదు. చూస్తుంటే జనసేన-బీజేపీ అసలు పొత్తులో ఉన్నాయా? లేవా? అన్న సందేహాలు కలుగకమానవు. మరి ఈ పొత్తు పొడుపు 2024 వరకూ నిలుస్తుందా? లేదా? అన్నది చూడాలి.