Nadendla Manohar: జనసేనలో నంబర్ 2.. సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ అని.. ఆయన చెమటను చిందించి ఈ పార్టీని ఒక్కడే నిలబెడుతున్నాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ కష్టాన్ని దగ్గరి నుంచి చూసిన వ్యక్తి ఇది చెబుతున్నానని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ చేశారు. ‘ఈ పార్టీకి యజమాని (ఓనర్ షిప్) పవన్ కళ్యాణ్ గారు, కార్యకర్తలు మాత్రమే….నాయకులం, మనం కాదు…’ అంటూ జనసేన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే నెలలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని పులివెందులలో ” కౌలు రైతు భరోసా యాత్ర ” ఉంటుందని.. 135 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయటం జరుగుతుందని రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సీఎం జగన్ సొంత జిల్లాలో రైతులను ఆదుకుంటూ జగన్ పాలనకే పవన్ కళ్యాణ్ సవాల్ విసురుతున్నారని పేర్కొన్నాడు.
కొంతమంది నాయకులు కార్యకర్తలను పార్టీ నుండి సస్పెండ్ చెయ్యమనీ, షోకాజ్ నోటీసులు ఇవ్వమని నన్ను అడుగుతున్నారని.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని చెయ్యమని.. కార్యకర్తలే జనసేన పార్టీకి వెన్నెముక… జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ దురాగతాలు, కక్షసాధింపు చర్యలకే వారంతా వైదొలుగుతున్నారని.. కానీ వారందరినీ కాపాడుకుంటామని నాదెండ్ల అభయమిచ్చారు.
ముఖ్యంగా జనసేనను పవన్ కళ్యాణ్ కష్టార్జితంగా.. పార్టీకి ఆయనే సర్వస్వం అంటూ నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పవన్ కళ్యాణ్ ఒంటిచేత్తో పార్టీని.. తను సినిమాల్లో నటించిన డబ్బులతో పార్టీ కోసం ఖర్చు చేస్తున్న తీరును నాదెండ్ల ప్రస్తావించి కొనియాడారు.