https://oktelugu.com/

Bigg Boss Non Stop Bindu Madhavi: ఒకే దుప్పట్లో బిందుమాధవి, శివ.. అఖిల్ బ్యాచ్ దారుణాలు

Bigg Boss Non Stop Bindu Madhavi: తెలుగు బుల్లితెరపై తిరుగులేని షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ఓటీటీ వేదికగా 24 గంటలు ప్రసారం అయ్యే సరికి జనాలు అతుక్కుపోతున్నారు. నాన్ స్టాప్ షోలో పాత పవర్ ఫుల్ కంటెస్టెంట్లు ఉండడంతో ఈ షోకు ఆదరణ బాగా వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఓటీటీ షోలో బోల్డ్ కంటెంట్ కనిపిస్తోంది. ముఖ్యంగా అఖిల్ బ్యాచ్ రెచ్చిపోతోంది. వారి ప్రత్యర్థులైన బింధుమాధవి-శివలను టార్గెట్ చేసి నోరుపారేసుకుంటోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2022 / 09:27 AM IST
    Follow us on

    Bigg Boss Non Stop Bindu Madhavi: తెలుగు బుల్లితెరపై తిరుగులేని షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ఓటీటీ వేదికగా 24 గంటలు ప్రసారం అయ్యే సరికి జనాలు అతుక్కుపోతున్నారు. నాన్ స్టాప్ షోలో పాత పవర్ ఫుల్ కంటెస్టెంట్లు ఉండడంతో ఈ షోకు ఆదరణ బాగా వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఓటీటీ షోలో బోల్డ్ కంటెంట్ కనిపిస్తోంది. ముఖ్యంగా అఖిల్ బ్యాచ్ రెచ్చిపోతోంది. వారి ప్రత్యర్థులైన బింధుమాధవి-శివలను టార్గెట్ చేసి నోరుపారేసుకుంటోంది.

    తాజాగా బిందుమాధవి, యాంకర్ శివ గురించి అఖిల్ బ్యాచ్ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అవిప్పుడు అఖిల్ బ్యాచ్ పై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ బిగ్ బాస్ ఓటీటీలో అందరిలోకి టైటిల్ ఫేవరెట్ గా ప్రముఖ హీరోయిన్ బిందుమాధవి నిలుస్తోంది. ఈమె తర్వాత రెండో ప్లేసులో అఖిల్ ఉన్నాడు. దీంతో వీరిద్దరికి హౌస్ లో క్షణం పడడం లేదు. కాంట్రవర్సీ యాంకర్ శివ కూడా ఊహించని రీతిలో హైలెట్ అవుతూ టాప్ 5లోకి దూసుకొస్తున్నాడు.

    బిందుమాధవి షో ప్రారంభం నుంచి యాంకర్ శివతో క్లోజ్ గా ఉంటోంది. అతడితోనే మాట్లాడుతూ.. ఆడుకుంటూ కనిపిస్తోంది. అలాగే శివకు మద్దతుగా పలుమార్లు కొందరితో గొడవలు కూడా పెట్టుకుంది. వీళ్లద్దరి స్నేహం బిగ్ బాస్ లో ఎవర్ గ్రీన్ ముందుకు సాగుతోంది.

    ఇక బిందుమాధవిపై పగను పెంచుకున్న అఖిల్ ఆయన బ్యాచ్ వీరిని దెబ్బకొట్టడానికి ప్రతీసారి ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. బిందుమాధవితో అఖిల్ బ్యాచ్ అయిన ‘నటరాజ్, ఆషు, అజయ్’లు గొడవలకు దిగుతున్నారు. ఇప్పటికే వీరి మధ్య ఎన్నో వివాదాలు చెలరేగాయి.

    తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిందుమాధవి-శివ గురించి అఖిల్, అజయ్, ఆషు, నటరాజ్ మాస్టర్ లు దారుణంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీన్ని నాగార్జున కూడా చూపించి ఈ బ్యాచ్ ను కడిగేశారు. బింధు-శివలను గురించి అజయ్ చెబుతూ ‘దుప్పట్లో దడదడ’ అంటూ నోరుపారేసుకున్నారు. అప్పుడు ఆషు కలిపించుకొని ‘ముసుగులో గుద్దులాట’ అని మరింత దారుణమైన పదజాలం వాడింది. ఆ తర్వాత అజయ్.. ‘గోడకేసి గుద్దుడే’ అన్నాడు. నటరాజ్ అయితే మరింతగా బూతులు మాట్లాడారు. దీన్ని బిగ్ బాస్ మ్యూట్ చేయడంతో బింధు-శివలపై ఈ బ్యాచ్ దారుణంగా మాట్లాడిందని అర్థమవుతోంది.

    మరో సందర్భంలో నటరాజ్ మాస్టర్ సైతం నోరుపారేసుకున్నారు. ‘బిగ్ బాస్ ఒక టాస్క్ పంపండి.. బిందును కొట్టాలి’ అంటూ నటరాజ్ రెచ్చిపోయారు. దీనికి ఆషు సైతం ‘స్కిట్ లో బిందుకు గుండు చేయాలి’ అంటూ ప్రోత్సహించింది. ఇలా బిందుమాధవి టార్గెట్ గా రూమ్ లోని అఖిల్ బ్యాచ్ చేస్తున్న ఆగడాలు.. మాటలకు అంతే లేకుండా పోతోంది.

    ఇంత దారుణంగా మాట్లాడిన వీరిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సాటి కంటెస్టెంట్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని విమర్శిస్తున్నారు.బిందుమాధవి ఆటకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆమెపై సానుభూతి వెల్లివిరిస్తోంది. ఆమెనే టైటిల్ విన్నర్ గా భావిస్తూ అండగా నిలిచి ఓట్ల వర్షం కురిపిస్తున్నారు.

    https://twitter.com/amrutha__shree/status/1513869531693084685?s=20&t=V2P0fPU_qsgWzVTMT0IddA