Illegal Relationship: కలియుగం అంటే ఏమో అనుకున్నాం గానీ.. కొన్ని ఘటనలు చూస్తుంటే మాత్రం ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపిస్తోంది. ముఖ్యంగా వావి వరసలు మరిచి అక్రమం సంబంధాలు పెట్టుకుని చివరకు జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు చాలామంది . ఇప్పుడు కూడా ఇద్దరు తల్లీ, కూతుర్లు చేసిన పని వారి జీవితాలకు ముగింపు పలికేలా చేసింది.

శారీరక సుఖం కోసం, డబ్బు కోసం చేసిన పని కాస్తా వారి ప్రాణాలను తీసింది. వడియారం అటవీ ప్రాంతంలో ఇద్దరు తల్లీ, కూతుర్ల శవాలు కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కాగా వీరిద్దరూ మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన యాదమ్మ, ఆమె కూతురు సంతోష అని తేలింది. దీంతో యాదమ్మ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also Read: Shivathmika Rajashekar: తెల్లటి గౌనులో అందాల విందు పంచిన స్టార్ హీరో కూతురు.. వైరల్
విచారణను మరింత వేగం పెంచగా.. వడియారం గ్రామానికి చెందిన నగేశ్‌ను అనుమానించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. తల్లీ, కూతుర్లకు నగేశ్‌తో కొంత కాలం కిందట పరిచయం ఏర్పడింది. అయితే వారిద్దరూ వావి వరసలు మరిచి నగేశ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తల్లీ, కూతురు కలిసి కావాలని అతనితో సంబంధం పెట్టుకున్నారు. కొద్ది కాలం తర్వాత డబ్బులు కావాలంటూ వేధించసాగారు. లేదంటే తమపై అత్యాచారం చేశావని కేసులు పెడతామని బెదిరించారు. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తూ వచ్చిన నగేశ్.. కొద్ది కాలం తర్వాత వారి వేధింపులు తట్టుకోలేక వారిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన వారిని వడియారం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఫుల్లుగా వారికి మద్యం తాగించాడు. వారు మత్తులోకి జారుకున్న తర్వాత గొంతునులిమి హత్య చేశాడని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు వివరించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Also Read:Ram Charan: రామ్ చరణ్ ఫాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వబోతున్న కొరటాల శివ