Telangana Govt Jobs Notification: తెలంగాణ నిరుద్యోగులు ఎప్నపుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగా భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని మొన్న అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆయన చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఇంకా నోటిఫికేషన్లు, జాబ్ షెడ్యూల్ రాలేదని కొంత నిరాశలో ఉన్నారు యువత.
కానీ సాంకేతిక కారణాల వల్లే ఆలస్యం అవుతోందని చెబుతున్నారు అధికారులు. ఇటీవలే ఆర్థిక 34వేల ఖాళీలకు అనుమతులు జారీ కూడా చేసింది. అయితే వీటికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. త్వరలోనే వస్తాయంటూ ప్రభుత్వంలో చెబుతోంది. కానీ ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి రేకెత్తుతోంది. అయితే వారందరూ ఇప్పుడు అలెర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.
Also Read: Bigg Boss Non Stop Bindu Madhavi: ఒకే దుప్పట్లో బిందుమాధవి, శివ.. అఖిల్ బ్యాచ్ దారుణాలు
ఎందుకంటే ఈ నెల చివరికల్లా సాంకేతిక కసరత్తులు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. మొదటగా గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చే అకవాశం ఉంది. ఈ విభాగంలో 503 ఖాళీలు ఉన్నాయి. ఇక తర్వాత పోలీస్ శాఖకు లో ఉన్న 16,587 ఖాళీలకు నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే వీటికి ఆర్థిక అనుమతులు కూడా ఇచ్చింది.
ఇక ఈ సారి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా పోలీస్ శాఖ ఖాళీల భర్తీ కోసం.. మూడేళ్ల వయో పరిమితి పెంపుకు కేసీఆర్ పర్మిషన్ ఇచ్చారు. ఇక గ్రూప్-1, గ్రూప్-2 భర్తీ కోసం ఇంటర్వ్యూలు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఇవన్నీ కూడా అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వినతుల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
Also Read:CM Jagan: కుల సమీకరణాల ఆధారంగానే పార్టీ బాధ్యతలు.. ఇదేం తీరు జగన్..?