https://oktelugu.com/

‘బిగ్ బాస్’ హోస్ట్ నాగార్జున ఎగ్జిట్.. రోజా ఇన్?

బుల్లితెర ప్రేక్షకులను ‘బిగ్ బాస్-4’ ఎంతగానో అలరిస్తోంది. బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లకు భిన్నంగా బిగ్ బాస్-4 కొనసాగుతోంది. బిగ్ బాస్-3కి హోస్టుగా చేసిన నాగార్జునే బిగ్ బాస్-4కు కూడా హోస్టు చేస్తున్నాడు. కిందటి సీజన్లోనూ నాగార్జున కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుత సీజన్లోనూ ‘కింగ్’ చిన్నవిరామం తీసుకోబోతున్నాడు. Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ అలా.. ఎన్టీఆర్ ఎలా? బిగ్ బాస్-3 సీజన్ సమయంలో నాగార్జున సినిమా షూటింగు కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు. అప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2020 / 01:11 PM IST
    Follow us on

    బుల్లితెర ప్రేక్షకులను ‘బిగ్ బాస్-4’ ఎంతగానో అలరిస్తోంది. బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లకు భిన్నంగా బిగ్ బాస్-4 కొనసాగుతోంది. బిగ్ బాస్-3కి హోస్టుగా చేసిన నాగార్జునే బిగ్ బాస్-4కు కూడా హోస్టు చేస్తున్నాడు. కిందటి సీజన్లోనూ నాగార్జున కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుత సీజన్లోనూ ‘కింగ్’ చిన్నవిరామం తీసుకోబోతున్నాడు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ అలా.. ఎన్టీఆర్ ఎలా?

    బిగ్ బాస్-3 సీజన్ సమయంలో నాగార్జున సినిమా షూటింగు కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు. అప్పుడు నాగార్జుకు బదులుగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కొన్ని ఎపిసోడ్స్ చేసింది. హోస్టుగా రమ్యకృష్ణ కొన్ని ఎపిసోడ్సే చేసినా బిగ్ బాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తాజాగా నాగార్జున తన ‘వైల్డ్ డాగ్’ సినిమా కోసం కులు మనాలికి వెళ్లాడు.

    దీంతో బిగ్ బాస్-4 సీజన్లోనూ నాగార్జున లేకుండానే కొన్ని ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. అయితే నాగార్జున ప్లేసును భర్తీ చేసేది ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. తాజా సమచారం మేరకు సీనియర్ హీరోయిన్, ఎమ్మెల్యే రోజా నాగ్ స్థానాన్ని భర్తీ చేయనుందనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం రోజా బతుకు జట్కాబండి.. జబర్దస్త్ వంటి కార్యక్రమాలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

    బుల్లితెరపై రోజాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సీనియర్ హీరోగా రోజాకు మంచి గుర్తింపు ఉంది. మంచి మాటకారి.. చమత్కారి అయిన రోజా బిగ్ బాస్ ను సమర్థవంతంగా నడిపించగలదని నిర్వాహాకులు భావిస్తున్నారట. దీంతో బిగ్ బాస్-4లో ఆమె కొన్ని ఎపిసోడ్లకు హోస్టుగా చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: దివీ-అవినాష్ రోమాన్స్? ప్రేమలోకంలో ‘బిగ్ బాస్’ హౌస్?

    చిరంజీవి నటించిన ‘బిగ్ బాస్’ మూవీలో రోజా హీరోయిన్ గా నటించింది. తాజాగా ‘బిగ్ బాస్’ షోకు ఆమె హోస్టు రానుండటం కాకతాళీకమే అయినా ఆమె అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. నాగ్ స్థానాన్ని రోజా ఏమేరకు భర్తీ చేస్తుందో వేచిచూడాల్సిందే..!