https://oktelugu.com/

పెద్ద స్కెచ్: జగన్‌ ఓటు బ్యాంకు పాలిటిక్స్‌?

ఏ పార్టీ అయినా ఒక్కసారి అధికారంలోకి వచ్చాక.. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటుంది. ఓటు బ్యాంకును పెంచుకోవాలనే చూస్తుంటుంది. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం.. ఏ రాష్ట్రమైనా.. చివరికి దేశస్థాయిలో రాజకీయాలైనా ఆ దిశలోనే నడుస్తుంటాయి. అందుకు ఎలాంటి వ్యూహాలను రచిస్తుంటారు. ఇక ఏపీలో తీసుకుంటే.. చంద్రబాబు, జగన్‌ ఈ రాజకీయాలకు అతీతులేం కాదు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఆచరణ సాధ్యంకాని హామిలిచ్చి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక […]

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2020 1:44 pm
    Follow us on

    ఏ పార్టీ అయినా ఒక్కసారి అధికారంలోకి వచ్చాక.. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటుంది. ఓటు బ్యాంకును పెంచుకోవాలనే చూస్తుంటుంది. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం.. ఏ రాష్ట్రమైనా.. చివరికి దేశస్థాయిలో రాజకీయాలైనా ఆ దిశలోనే నడుస్తుంటాయి. అందుకు ఎలాంటి వ్యూహాలను రచిస్తుంటారు. ఇక ఏపీలో తీసుకుంటే.. చంద్రబాబు, జగన్‌ ఈ రాజకీయాలకు అతీతులేం కాదు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఆచరణ సాధ్యంకాని హామిలిచ్చి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పెద్దగా అమలు చేయలేదు. దీంతో ప్రజలు 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ వైపు మొగ్గుచూపారు. అఖండ మెజారిటీతో గెలిపించారు.

    Also Read: జగన్ ఇస్తానన్నా.. వాళ్లు ఇంట్రస్ట్ చూపించడం లేదట.!

    మొన్నటి వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజధాని అంశాన్ని తప్ప వేరే వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ మాత్రం సంక్షేమ పథకాలపైనే మక్కువ చూపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఇందుకోసం ఎన్ని విధాలా కష్టపడుతున్నారో చూస్తూనే ఉన్నాం. చంద్రబాబుకు ఎదురైన అనుభవాన్ని తమకు రాకుండా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బీసీలను టార్గెట్‌ చేశారు జగన్‌. సమాజంలో బీసీ ఓట్ షేర్ దాదాపు సగం ఉంది. పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుండి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీలు మొదటిసారి బయటకు వచ్చేసి వైసీపీకి మద్దతుగా నిలిచారు.

    బీసీలపాటు కాపుల్లో మెజారిటీ సెక్షన్ వైసీపీ మొదటి నుంచీ అండగా నిలుస్తోంది. మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, రెడ్లలో మెజారిటీ సాలిడ్ గా ఓటు చేయటంతో గత ఎన్నికల్లో అఖండ విజయం సాధ్యమైంది. టీడీపీని వదిలి వచ్చిన బీసీల ఓటుబ్యాంకును శాశ్వతంగా తమ ఖాతాలోనే పెట్టుకునేలా జగన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే.. ఏపీలో చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్ బీసీల్లో ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్‌ను నెరవేర్చేందుకు జగన్‌ నిర్ణయించారు. ఆ వర్గాల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. వీటికి ఈనెల 18వ తేదీన చైర్మన్లు, డైరెక్టర్లను నియమించబోతున్నారు.

    మొత్తం కార్పొరేషన్లలో సగం సీట్లను మహిళలకు కేటాయించనున్నారు. ఇక డైరెక్టర్ల నియామకంలోనూ 50 శాతం మహిళలకే ఇస్తున్నారు. కీలక పదవులు రెడ్లకు ఇచ్చి పవర్ లేని పదవులు బీసీలకు ఇస్తున్నారు అనే ఆరోపణలున్నా.. పదవులైతే ఇస్తున్నారన్న పేరైతే వస్తోంది. అంతేకాదు, వైసీపీ నేతలకు ఈ పదవుల పంపకం ద్వారా అంతర్గత ప్రజాస్వామ్యం పెచ్చరిల్లకుండా ప్లానేశారు జగన్.

    Also Read: మరో దుమారం: ఏపీ సర్కార్‌‌ కు అప్పుగా టీటీడీ నిధులా?

    ఈ ప్లాన్‌తో ఒకవైపు బీసీల ఓట్లు.. అదే సమయంలో మహిళల ఓట్లను పదిలం చేసుకోవటంతోపాటు పార్టీలో అసంతృప్తిని తగ్గించే భారీ వ్యూహమని చెప్పాలి. ఇప్పటికే జగన్‌ తన కేబినెట్‌లో స్పీకర్ పదవితోపాటు ఏడు మంత్రి పదువులను బీసీ వర్గాలకే కేటాయించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లోనూ 2.71 కోట్లమంది బీసీ లబ్ధిదారులకు ఏదో ఓ పథకం అందిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక బీసీల సమస్యల పరిష్కారానికి శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు కూడా కీలకమైందే. దీనిని బట్టి చూస్తుంటే.. జగన్‌ ఓటు బ్యాంకు రాజకీయాలను అప్పుడే మొదలుపెట్టినట్లుగా అర్థం అవుతూనే ఉంది.