bigg boss 7 telugu nayani
Nayani Pavani Remuneration : బిగ్ బాస్ సీజన్ 7లో నయని పావని ఎలిమినేషన్ గుండెలు బరువెక్కేలా చేసింది. ఈ వారానికి అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, తేజా, పూజా మూర్తి, నయని పావని, అశ్వినిశ్రీ నామినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టిన బిగ్ బాస్ ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వచ్చాడు. చివర్లో అశ్విని శ్రీ, నయని పావని మిగిలారు. ఉత్కంఠ మధ్య వీరిద్దరిలో నయని పావని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పాడు. దానితో నయని పావని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
నయని పావని గట్టిగా ఏడ్చేసింది. అసలు ఊహించలేదన్నట్లు ఆమె ప్రవర్తించింది. ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. గత సీజన్లో గీతూ రాయల్ 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ రోజు గుక్కపట్టి ఏడ్చింది. నేను ఇంటికి వెళ్ళను. బిగ్ బాస్ హౌస్లోనే ఉంటానంటూ చిన్నపిల్లలా మారాం చేసింది. అదే స్థాయిలో నయని పావని కన్నీటి పర్యంతం అయ్యింది. వేదిక మీద ఎమోషనల్ గా మాట్లాడింది.
ముఖ్యంగా శివాజీని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. ఆయన నాన్నతో సమానం అన్నది. వీలైతే తనను ఎలిమినేట్ చేసి నయని పావనిని హౌస్లోకి తేవాలని శివాజీ నాగార్జునను కోరాడు. ప్రేక్షకుల నిర్ణయం ఆధారంగానే ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. ఈ షో కోసం నయని పావని ఆస్ట్రేలియా నుండి వచ్చినట్లు సమాచారం. కానీ ఆమె ఎక్కువ రోజులు హౌస్లో ఉండలేకపోయింది.
ఇక వారం రోజులు మాత్రమే ఉన్న నయని పావని రెమ్యూనరేషన్ ఎంతనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈమె వారానికి రూ. 2 లక్షల ఒప్పందం మీద హౌస్లో అడుగుపెట్టిందట. ఆ లెక్కన ఒక వారమే ఉన్న నయని రెండు లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకుందట. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావనిని ఇలా ఎలిమినేట్ చేయడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఓటింగ్ కి విరుద్ధంగా ఆమె ఎలిమినేషన్ జరిగిందని అంటున్నారు.