https://oktelugu.com/

Avatar 2 India Prices: ఇండస్ట్రీ షాక్: అంతపెట్టి కొనలేం..అవతార్ 2 సినిమాకు అంత రేట్ అంట?

Avatar 2 India Prices: అవతార్ 2 సినిమా ఈ సంవత్సరాంతంలో విడుదలకు సిద్ధమవుతోంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అనేది 2009 లో విడుదలైన అవతార్ 1 సినిమాకు సీక్వెల్ కథ. నాటి బ్లాక్ బస్టర్ హిట్ కు కొనసాగింపుగా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ ఈ రెండవ సినిమాను రూపొందించింది.. జేమ్స్ కామెరూన్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించారు. 20వ సెంచరీ స్టూడియోస్ దాదాపు $250 మిలియన్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2022 / 09:18 PM IST
    Follow us on

    Avatar 2 India Prices: అవతార్ 2 సినిమా ఈ సంవత్సరాంతంలో విడుదలకు సిద్ధమవుతోంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అనేది 2009 లో విడుదలైన అవతార్ 1 సినిమాకు సీక్వెల్ కథ. నాటి బ్లాక్ బస్టర్ హిట్ కు కొనసాగింపుగా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ ఈ రెండవ సినిమాను రూపొందించింది.. జేమ్స్ కామెరూన్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించారు. 20వ సెంచరీ స్టూడియోస్ దాదాపు $250 మిలియన్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లోని అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా మార్చింది.

    ట్రేడ్ సర్కిల్స్‌లో అవతార్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ మార్కెట్ లో ఈ విజువల్ వండర్ చాలా హైప్ క్రియేట్ చేయబడింది. దీని సినిమా టికెట్ ,పంపిణీ ధరలు ధరలు దాదాపు అన్ని రాష్ట్రాల్లోని టాప్ హీరోల కలెక్షన్ల రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాను కూడా ఇండియాలో భారీ రేటుకు అమ్ముతున్నారట.. అయితే ఈ ధరలు తమకు పనికొస్తాయా లేదా అనే సందిగ్ధంలో కొనుగోలుదారులు సినిమాను అంత రేటు పెట్టి కొనడానికి వెనుకంజ వేస్తున్న పరిస్థితి నెలకొంది.

    తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కోట్ చేసిన దీని ధర దాదాపు రూ.100 కోట్లు. ఇది చాలా షాకింగ్ ధర అని అంటున్నారు. స్టార్ హీరోలకు కూడా 100 కోట్ల బిజినెస్ అంత తేలికైన పని కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవే రేట్లకు సినిమాను అమ్ముతున్నారట.. ఇతర పరిశ్రమలతో కూడా అదే రేటు పలుకుతున్నారట..

    ఈ చిత్రంలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, మిచెల్ రోడ్రిగ్జ్ , సిగౌర్నీ వీవర్ కీలక పాత్రల్లో నటించారు. ‘అవతార్: వే ఆఫ్ వాటర్’ కేట్ విన్స్‌లెట్ , మిచెల్ యో లాంటి ప్రముఖ నటులు నటించారు. ఈ మూవీ 16 డిసెంబర్ 2022న విడుదల అవుతోంది. భారీ రేటుకు కొని భారీ టికెట్ రేట్లు పెడితే జనాలు ఎవరూ చూడరన్న భయం సినిమా వర్గాలను వెంటాడుతోంది. మరి ఈ రేటు పెట్టి కొంటారా? లేదా? అన్నది వేచిచూడాలి.