Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో ఒంటరిగా.. దూకుడుగా పోరాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పవన్ విశాఖలో చేపట్టిన పర్యటన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..విశాఖ విమానాశ్రయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైసీపీ మంత్రులపై దాడులు చేయడం దగ్గర నుండి ఈ వివాదం చోటు చేసుకుంది..కావాలని గొడవ కోరుకున్న వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభిమానుల మధ్యలో నుండి వెళ్లడం.. రెచ్చగొట్టడంతో జనసైనికులు రెచ్చిపోయి గొడవ చేశారు.

అనంతరం పవన్ కళ్యాణ్ భద్రతకు పెనుముప్పు అంటూ ఆయన పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. భగ్నం కలిగించారు. ఆయనను బయటకు రాకుండా చేశారు. జనసేన పార్టీ నాయకులను వరుసగా అరెస్ట్ చేశారు. పవన్ ను విశాఖ నుంచి వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేశారు. పవన్ ను హోటల్ లో నిర్బంధించడంతో అభిమానులు కంగారుపడ్డారు.
పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా రావడంతో పోలీసులు ఇలా చేశామని చెప్పుకొచ్చారు. మరో పక్క జనసేన పార్టీ కార్యకర్తల నుండి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని..వారిపై దాడి ఎప్పుడైనా జరగొచ్చని రిపోర్ట్ అందిందని వైసీపీ అధిష్టానం కూడా చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
ఇది ఇలా ఉండగా.. గత కొద్ది రోజుల నుండి పవన్ కళ్యాణ్ కారుని గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారు. ఏపీ రెడ్డి కార్పొరేషన్ కు చెందిన వాహనంలో పవన్ ను వెంబడించినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఇంటి నుండి బయటకి వచ్చినప్పుడు.. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ కారుని ఫాలో అవుతుండడం గమనించామని.. అర్థ రాత్రి పూట పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కారు ఆపి కళ్యాణ్ గారిని దుర్భాషలు ఆడుతున్నారని.. ఈ మొత్తం వీడియో షూట్ చేసి ఈరోజు పోలీసులకు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆ అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారని నాదెండ్ల మనోహర్ వివరించారు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని.. రెక్కీ నిర్వహించినట్టు సమాచారం.
ప్రస్తుతం ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కంగారు రేపుతోంది.. ‘జాగ్రత్తగా ఉండు అన్నా’ అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి అభిమానులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదురుకోలేక ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి శిఖండి వేషాలు వేస్తున్నాడంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈక్రమంలోనే ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న విషయం కలకలం రేపుతోంది.