Akkineni Akhil at Jr NTR house: చిరంజీవి(Megastar Chiranjeevi) కొడుకు రామ్ చరణ్(Global Star Ram Charan) తర్వాత, ఇండస్ట్రీ లోకి అత్యంత భారీ హైప్ తో అడుగుపెట్టిన మరో హీరో నాగార్జున(Akkineni Nagarjuna) కొడుకు అఖిల్(Akkineni Akhil). మనం సినిమాలో అక్కినేని అఖిల్ క్యామియో రోల్ ని చూసి, ఈ రేంజ్ లో ఉన్నాడేంటి, కచ్చితంగా ఇండస్ట్రీ లో మరో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతాడు, రాబోయే జనరేషన్ కి కాబోయే మహేష్ బాబు అంటూ అఖిల్ ని తెగ లేపారు. అలా ఇండస్ట్రీ లోకి ‘అఖిల్’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ ఓవరాల్ లాంగ్ రన్ లో ఫ్లాప్ గానే మిగిలింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అఖిల్ 5 సినిమాలు చేసాడు. కానీ ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా రాలేదు. మధ్యలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది కానీ, పూర్తి స్థాయి కమర్షియల్ సక్సెస్ మాత్రం కాదు.
అయితే అఖిల్ కెరీర్ ని చక్కబెట్టే పనిలో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ఉన్నాడా..?, చిన్నతనం నుండి అఖిల్ కి బాగా క్లోజ్ గా ఉన్న స్టార్ సెలబ్రిటీలతో ఒకరు ఎన్టీఆర్. తరచూ వీళ్లిద్దరు కలుస్తూనే ఉంటారు, అఖిల్ కి కెరీర్ పరంగా ఎప్పటికప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సూచనలు ఇస్తూనే ఉంటాడు. అలా ఈసారి కూడా ఆయన అఖిల్ కోసం ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక వార్త. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో ప్రశాంత్ నీల్ వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ పనితనం ఎన్టీఆర్ కి తెగ నచ్చేసింది. ఇతను అయితే అఖిల్ కి కావాల్సిన బ్లాక్ బస్టర్ ఇవ్వగలడు అని ఎన్టీఆర్ బలంగా నమ్మాడట.
ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ వెంటనే అఖిల్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడం, ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ డైరెక్టర్ ని అఖిల్ కి పరిచయం చేయడం, ఇతని వద్ద ఒక మంచి స్టోరీ ఉంది, నీకు అదిరిపోతుంది, ఒకసారి విను అని చెప్పడం, అఖిల్ అందుకు ఒప్పుకోవడం వంటివి టకాటకా జరిగిపోయాయి. మరి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది అఖిల్ నిర్ణయం పైనే ఆధారపడుంది. ప్రశాంత్ నీల్ వద్ద పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే కచ్చితంగా ప్రశాంత్ నీల్ తరహా టేకింగ్ ఉంటుంది. యాక్షన్ జానర్ లోనే సినిమా తీయగలడు. మరి అఖిల్ కి ఆయన ఎంత వరకు ఉపయోగపడతాడా చూడాలి. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.