spot_img
Homeక్రైమ్‌Sri Chaitanya School incident: కార్పొరేట్‌ పాఠశాలలో ‘టీ’చకుడు!

Sri Chaitanya School incident: కార్పొరేట్‌ పాఠశాలలో ‘టీ’చకుడు!

Sri Chaitanya School incident: సమాజంలో గురువుకు ఉన్నతమైన స్థానం ఉంది. గురువు లేని విద్య వ్యర్థం. మనం ఏం నేర్చుకున్నా గురువు ఉండాలి. ఇక చదువు విషయంలో తప్పనిసరి. గురువే భవిష్యత్‌కు బాటలు వేసేది. అందుకే టెక్నాలజీ ఎంత పెరిగినా గురువుల గౌరవం తగ్గడం లేదు. కానీ, కొందరు ‘టీ’చకుల కారణంగా గురువుల గౌరవం మంటగలుస్తోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన బడిలో కామాంధులుగా మారుతున్నారు. అమ్మాయిలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. లైంగికదాడులు చేస్తున్నారు. తాజాగా ఓ కార్పొరేట్‌ పాఠశాలలో మరో టీచకుడి బాగోతం బట్టబయలైది.

మాయ మాటలతో పెళ్లిళ్లు..
హైదరాబాద్‌ పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఉపాధాయయుడు పర్రె మైటీన్‌ పదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థిని మెడలో పసుపు తాడు గమనించిన తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు.

తండ్రి ఫిర్యాదుతో కేసు..
విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. టీచకుడు పర్రె మైటీస్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన 20 రోజుల క్రితం జరిగింది. పాఠశాల యాజమాన్యం విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచింది. తాజాగా టీచకుడి అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చింది.

విద్యార్థినుల భద్రతపై ఆందోళన..
ఈ ఘటన పాఠశాలల్లో మానిటరింగ్‌ లోపాలను బహిర్గతం చేసింది. గురువగా భావిస్తున్న ఉపాధ్యాలు.. విద్యార్థినుల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు, యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తల్లిదండ్రులు కూడా విద్యార్థినుల ప్రవర్తనలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version