Homeఎంటర్టైన్మెంట్Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం' లో ట్రైన్ ఎపిసోడ్.. థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయమట.. అందులో ఏముందంటే?

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ లో ట్రైన్ ఎపిసోడ్.. థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయమట.. అందులో ఏముందంటే?

Adarsha Kutumbam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రైటర్ గా కెరియర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి చాలా తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. తన మాటల్లో ఉండే పదును ప్రతి ఒక్క ప్రేక్షకుడి గుండెల్లో గుచ్చుకుంటుంది. అందువల్లే ఆయన మాటల మాంత్రికుడు అనే పేరును కూడా సంపాదించుకున్నాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని చాలా హిలేరియాస్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ లో వచ్చిన చాలా సినిమాల్లో ట్రైన్ ఎపిసోడ్ సీక్వెన్స్ లు చాలానే వచ్చాయి.కానీ శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. దాదాపు 40 నిమిషాల పాటు ఇక్కడే సినిమా మొత్తం నడుస్తుంది. సినిమాలోని ఓవరాల్ కామెడీ మొత్తం ఆ ట్రైన్ ఎపిసోడ్ లోనే ఉంటుంది. అలాగే సినిమా మలుపు కూడా అక్కడే తిరుగుతుంది. ఇక దాన్ని బీట్ చేసే విధంగా చాలా సినిమాల్లో ట్రైన్ జర్నీలో కామెడీ రాసినప్పటికి వెంకీ మూవీ కామెడీ ట్రాక్ ను బ్రేక్ చేయలేకపోయాయి. కానీ గురూజీ మాత్రం ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. వెంకీ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఒక 25 నిమిషాల పాటు సాగే ట్రైన్ ఎపిసోడ్ ఉందట…

ఆ సీక్వెన్స్ మొత్తం హిలేరియస్ కామెడీతో ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఆయన ఇంతకుముందు ఎలాగైతే తన మాటల్లోని పదునుతో కామెడీని జనరేట్ చేశాడో ఇప్పుడు దానికి భిన్నంగా సిచువేషనల్ కామెడీని చేయడానికి ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

కారణం ఏంటంటే ఆయన మాటల్లో ఉండే పదును వల్ల వచ్చే కామెడీ కంటే సిచువేషనల్ గా వచ్చే కామెడీ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరు దానికి కనెక్ట్ అవుతారని ఆయన భావించినట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన దాన్ని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

గత సినిమాల కంటే కూడా ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా చాలా గట్టిగానే ఉంటుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular