Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న నటుడు చిరంజీవి… ఆయన నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. అలాగే తెలుగు ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర వహించాడు.ఒక మూస ధోరణిలో వెళ్తున్న సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఎప్పటికప్పుడు తన పంథా మార్చుకుంటూ డిఫరెంట్ సినిమాలను చేశాడు. ఇక బటన్ లో వైవిధ్యాన్ని చూపిస్తూనే తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. చిరంజీవి తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందినప్పటికి పాన్ ఇండియాలో మాత్రం ఆయన సక్సెస్ కాలేకపోయాడు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లాలని చిరంజీవికి చాలా కోరిక ఉండేది. అందుకే ఇక్కడ సూపర్ హిట్ అయిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను ఆజ్ కా గూండారాజ్ అంటూ బాలీవుడ్ లో రీమేక్ చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక మరో రెండు సినిమాలు రీమేక్ చేసిన కూడా చిరంజీవికి బాలీవుడ్ లో పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆయన కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు… ముఖ్యంగా చిరంజీవి పాన్ ఇండియాలో సక్సెస్ కాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన సినిమాలు అక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.
అప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక డిఫరెంట్ జానర్ లో ఉండేవి. కానీ చిరంజీవి చేసిన సినిమాలు మాస్ ని టార్గెట్ చేస్తూ వచ్చాయి. దానివల్ల బాలీవుడ్ ప్రేక్షకులకు అప్పుడు మాస్ సినిమాలు పెద్దగా నచ్చేవి కావు దాంతో చిరంజీవిని వాళ్ళు ఈజీగా రిజెక్ట్ చేశారు…
అలాగే అప్పట్లో జనాలు సౌత్ సినిమా హీరోలను, వాళ్ళు చేసే సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. చిరంజీవి సక్సెస్ కాకపోవడానికి ఇది కూడా ఒక మూల కారణమనే చెప్పాలి… ఇక చివరగా చిరంజీవి బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసి ఆపేశాడు…
కానీ అక్కడ ప్రేక్షకుల యొక్క అభిరుచి తెలుసుకొని దానికి తగ్గట్టుగా సినిమాలను చేసి ఉంటే అతన అక్కడు సక్సెస్ అయి ఉండేవాడు. ఒక రకంగా పాన్ ఇండియాలో తను సక్సెస్ కాకపోవడానికి తన తప్పు కూడా ఉందని పలు సందర్భాల్లో చిరంజీవి స్వయంగా ఒప్పుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యంగా చెప్పుకోవాలి…