Vishwam Movie Collections : కొన్ని సార్లు ఎలాంటి అంచనాలు, క్రేజ్ లేకుండా విడుదలయ్యే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టడం మనం చాలాసార్లు చూసాము. చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా అలాంటి సంఘటన ‘విశ్వం’ చిత్రం విషయంలో జరిగింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమా ‘దసరా’ కానుకగా విడుదలైంది. ఒక పక్క ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం, మరో పక్క రజనీకాంత్ ‘వెట్టియాన్’ రెండు కూడా పాజిటివ్ టాక్స్ ని తెచ్చుకొని మంచి వసూళ్లతో దూసుకుపోతున్నాయి. అలాంటి సమయంలో ఎలాంటి అంచనాలు లేనటువంటి విశ్వం చిత్రాన్ని విడుదల చేస్తే ఎవరు మాత్రం చూస్తారు అంటూ ట్రేడ్ విశ్లేషకులు అనేక కామెంట్స్ చేసారు. వాళ్ళ కామెంట్స్ కి తగ్గట్టుగానే మొదటి రోజు ఈ సినిమాని ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ టాక్ మాత్రం పర్వాలేదు అనిపించింది.
రీసెంట్ గా విడుదలైన శ్రీను వైట్ల సినిమాల కంటే ఈ చిత్రం చాలా బాగుంది, కామెడీ వర్కౌట్ అయ్యింది అని చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అదే టాక్ బయట కూడా పాకడంతో ఈ సినిమాకి దసరా రోజున మంచి వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత అదే ట్రెండ్ ని కొనసాగిస్తూ వచ్చింది. అలా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఇప్పటి వరకు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాం. నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి 12 రోజులకు గాను 2 కోట్ల 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఆంధ్ర ప్రదేశ్ లో 4 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
అలా 12 రోజులకు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 7 కోట్ల 2 లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది. అలాగే కర్ణాటక, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 7 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా మొదటి రోజు కేవలం 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్ల ఓపెనింగ్ తో మొదలైన ఈ సినిమా 8 కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చింది. దీపావళి వరకు కలెక్షన్స్ ని డీసెంట్ గా రాబట్టగలిగితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 10 కోట్ల రూపాయలకు జరిగింది. దీపావళి వరకు ఆడితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అప్పటి వరకు కలెక్షన్స్ ని హోల్డ్ చేయగలదా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రానికి డైలీ షేర్స్ 20 లక్షల రూపాయిల రేంజ్ లో వస్తున్నాయి.