https://oktelugu.com/

Rajasab : రాజాసాబ్’ కి విక్టరీ వెంకటేష్ పాత చిత్రంతో లింక్ ఉందా..? ఇదెక్కడి ట్విస్ట్ సామీ..మారుతి అసలు ఏమి తీస్తున్నాడో!

విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన పాత చిత్రం 'నాగవల్లి' లోని లుక్స్ తో ప్రభాస్ రాజా సాబ్ లుక్స్ పోలి ఉందని, ఆ సినిమాని కాపీ కొట్టారంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ నడుస్తున్నాయి. చంద్రముఖి కి సీక్వెల్ గా తెరకెక్కిన 'నాగవల్లి' చిత్రం అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇందులో వేంకటపతి రాజు గా నటించిన వెంకటేష్ పాత్ర పై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 23, 2024 / 09:47 PM IST

    Rajasab

    Follow us on

    Rajasab : రెబల్ స్టార్ ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ మూవీ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ మోషన్ పోస్టర్ ని నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ ని ఇప్పటి వరకు అభిమానులు, ప్రేక్షకులు చూడని లుక్ లో చూసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. నిన్న మొన్నటి వరకు ‘రాజా సాబ్’ నుండి విడుదలైన ప్రతీ పోస్టర్ ని ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్స్ తో కనిపించాడు. ఇప్పుడు ఏకంగా ఆయన ఓల్డ్ లుక్స్ లో దర్శనం ఇవ్వడంతో , ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే విషయం అందరికీ అర్థమైంది. నేడు విడుదల చేసిన మోషన్ పోస్టర్ లోని ప్రభాస్ లుక్ ని చూసి అభిమానులు అయితే బాగా సంతృప్తి చెందారు. కానీ ఇతర హీరోల అభిమానులు మాత్రం ప్రభాస్ లుక్స్ పై దారుణంగా ట్రోల్స్ వేశారు.

    విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన పాత చిత్రం ‘నాగవల్లి’ లోని లుక్స్ తో ప్రభాస్ రాజా సాబ్ లుక్స్ పోలి ఉందని, ఆ సినిమాని కాపీ కొట్టారంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ నడుస్తున్నాయి. చంద్రముఖి కి సీక్వెల్ గా తెరకెక్కిన ‘నాగవల్లి’ చిత్రం అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇందులో వేంకటపతి రాజు గా నటించిన వెంకటేష్ పాత్ర పై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వెంకటేష్ వేసే డ్యాన్స్ ని చూస్తే ఇప్పటికీ నవ్వు ఆగదు. ఆ సినిమాలోని వెంకటేష్ గెటప్ ని గుర్తు చేసుకుంటూ నెటిజెన్స్ ట్రోల్స్ వేస్తున్నారు. అయితే ఈ లుక్ ప్రభాస్ కి చాలా బాగా సూట్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు కానీ, ఈ మోషన్ పోస్టర్ తర్వాత మాత్రం అంచనాలు భారీగా పెరిగాయి. ఇంతకు ముందు ప్రభాస్ సినిమాలకు ఎలాంటి బజ్ ఉండేదో, ఈ సినిమాకి కూడా అలాంటి బజ్ రాబోయ్ రోజుల్లో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

    వచ్చే ఏడాది ఏప్రిల్ 11 వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో హారర్ కామెడీ జానర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది విడుదలైన ‘స్త్రీ2’ అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాంటిది ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కి ఈ జానర్ లో సరైన సినిమా పడితే, ఇక ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో ఊహించడానికి కూడా సాధ్యం అవ్వదు, మరి డైరెక్టర్ మారుతి ఎలా తియ్యబోతున్నాడో చూడాలి.