Viswam: హీరో గోపీచంద్-శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కించిన చిత్రం విశ్వం. యాక్షన్, రొమాంటిక్, కామెడీ అంశాలు ప్రధానంగా తెరకెక్కింది. వరుస పరాజయాల నేపథ్యంలో కొంచెం గ్యాప్ తీసుకుని దర్శకుడు విశ్వం మూవీ తెరకెక్కించారు. ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో చేసిన తప్పులు చేయలేదని. ఈ మూవీ పక్కాగా తెరకెక్కించానని. మీ అందరికీ నచ్చుతుందని శ్రీను వైట్ల ప్రమోషన్స్ లో తెలియజేశాడు.
ఇక తన హిట్ సినిమాల్లో ఒకటైన వెంకీ లోని ఐకానిక్ ట్రైన్ సీన్ ని మరోసారి విశ్వం మూవీతో పరిచయం చేశాడు. గోపీచంద్ కి జంటగా కావ్య థాపర్ నటించింది. నరేష్, ప్రగతి, సునీల్, వెన్నెల కిషోర్, జిషు సేన్ గుప్త వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న విశ్వం మూవీ విడుదలైంది. విశ్వం చిత్రానికి ఓ మోస్తరు టాక్ దక్కింది. ఓపెనింగ్స్ పర్లేదు అనిపించాయి. అనంతరం పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన గోపీచంద్, శ్రీను వైట్ల చిత్రాల కంటే బెటర్ అన్నారు.
కాగా విశ్వం మూవీ థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ క్రమంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీపావళి కానుకగా విశ్వం డిజిటల్ స్ట్రీమింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. విశ్వం డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. రూ. 12 కోట్లకు విశ్వం సినిమా హక్కులను ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీపావళికి ప్రైమ్ లో విశ్వం అందుబాటులోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం లేదు.
ఇక విశ్వం మూవీ కథ విషయానికి వస్తే… మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఖురేషి(జిషు సేన్ గుప్త) ఇండియాలో ఓ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఈ టెర్రరిస్ట్స్ ఎటాక్స్ కి సెంట్రల్ మినిస్టర్ బాచిరాజు(సునీల్) సహకరిస్తారు. ఈ కుట్ర గురించి మినిష్టర్(సుమన్) కి తెలియడంతో ఆయన్ని చంపేస్తారు. మినిస్టర్ మర్డర్ ని ఒక పాప చూస్తుంది. దాంతో టెర్రరిస్ట్స్ కి ఆ పాప టార్గెట్ అవుతుంది. ఆ పాపను కాపాడే బాధ్యత విశ్వం(గోపి చంద్) తీసుకుంటాడు?
మరి విశ్వం పాపను కాపాడాడా?. విశ్వం నేపథ్యం ఏమిటీ? టెర్రరిస్ట్స్ గ్రూప్ కి విశ్వం ఎలా చెక్ పెట్టాడు? ఈ కథలో హీరోయిన్ కావ్య థాపర్ పాత్ర ఏమిటీ అనేది మిగతా కథ.