https://oktelugu.com/

Nishadh Yusuf: విషాదంలో చిక్కుకున్న సూర్య ‘కంగువ’ మూవీ టీం..అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎడిటర్!

రెండు డిఫరెంట్ టైం పీరియడ్స్ లో జరిగే ఈ కథ ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని అంటున్నారు మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కాలం తర్వాత సూర్య సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 30, 2024 / 02:49 PM IST

    Nishadh Yusuf

    Follow us on

    Nishadh Yusuf: నేడు తమిళ సినీ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడి స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కంగువ’ కి ఎడిటర్ గా పని చేసిన నిషాద్ యూసఫ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మలయాళం సినీ ఇండస్ట్రీ లో పలు సినిమాలకు ఎడిటర్ గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన, నిన్న రాత్రి 2 గంటల సమయంలో కేరళలోని పనమ్ పిల్లీ నగర్ లోని తన అపార్ట్మెంట్స్ లో మృతి చెందాడు. ఆయన మృతికి సంబంధించిన కారణాలు తెలియకపోవడం అనుమానాస్పద మృతిగా పరిగణించి, పోలీసులు విచారణ చేపడుతున్నారు. థల్లామాలా, ఛావర్, ఉండా వంటి సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన ఆయన, ‘కంగువ’ లాంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రానికి ఎడిటర్ గా పని చేసే అవకాశం దక్కింది.

    ఈ చిత్రం తర్వాత ఆయన రేంజ్ మరో లెవెల్ కి వెళ్తుంది అనుకునేలోపు, ఆయన జీవితం ఇలా ముగిసిపోవడం శోచనీయం. ఈ సందర్భంగా సూర్య కాసేపటి క్రితమే తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ ఒక ట్వీట్ వేసాడు. ‘నిషాద్ చనిపోయాడు అనే వార్త తెలిసి తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి అయ్యాను. కంగువ చిత్రానికి నువ్వు పడిన కష్టం మాకు ఎంతో ముఖ్యమైనది. సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తావ్ అనుకునేలోపు ఇలా జరగడం చాలా బాధకి గురి చేస్తుంది. ఎక్కడున్నా నీ ఆత్మకి శాంతి చేకూరాలి, నీ కుటుంబ సబ్యులకు ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలి’ అంటూ సూర్య ఎమోషనల్ గా వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇటీవలే తమిళనాడు లో నిర్వహించిన ‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నిషాద్ హాజరయ్యాడు. ఈ చిత్రం గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడాడు. నాలుగు రోజులు క్రితం అంత సంతోషంగా ఉన్న మనిషి, అకస్మాత్తుగా ఇలా చనిపోవడం అంటే, ఆయన కుటుంబ సబ్యులకు ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక కంగువ చిత్రం విషయానికి వస్తే సుమారుగా 3 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత హీరో సూర్య నుండి విడుదల అవుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ఇది.

    రెండు డిఫరెంట్ టైం పీరియడ్స్ లో జరిగే ఈ కథ ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని అంటున్నారు మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కాలం తర్వాత సూర్య సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. మొదటి రోజు తెలుగు లో 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్ల ఓపెనింగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.