Pakka Commercial Collections: హీరో గోపీచంద్ కి హిట్ ఇస్తా అంటూ మారుతి చేసిన “పక్కా కమర్షియల్” సినిమా పరిస్థితి ఏమిటి ?, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంది ?, ఇంతకీ.. ఈ సినిమాకి థియేటర్స్ వద్ద గిట్టుబాటు అవుతుందా ? లేదా ?, ఈ సినిమా నిర్మాత బన్నీ వాసుకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? తెలుసుకుందాం రండి. ముందుగా ఈ సినిమా మొదటి 10 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
10 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..
Also Read: Happy Birthday Collections: హ్యాపీ బర్త్ డే 5 డేస్ కలెక్షన్స్.. సేఫ్ అవుతుందా ? లేదా ?
నైజాం 2.17 కోట్లు
సీడెడ్ 1.14 కోట్లు
ఉత్తరాంధ్ర 1.16 కోట్లు
ఈస్ట్ 0.65 కోట్లు
వెస్ట్ 0.49 కోట్లు
గుంటూరు 0.59 కోట్లు
కృష్ణా 0.56 కోట్లు
నెల్లూరు 0.39 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 10 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” 7.16 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 14.26 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.39 కోట్లు
ఓవర్సీస్ 0.84 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 10 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” రూ. 7.89 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 15:58 కోట్లను కొల్లగొట్టింది
బాక్సాఫీస్ వద్ద ఈ ‘పక్కా కమర్షియల్’ సినిమాకి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మిగిలిన కొన్ని ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలే ఓన్ గా రిలీజ్ చేసుకున్నాయి. కాబట్టి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు. ఎలాగూ మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి.. ఇక కలెక్షన్స్ రావడం కష్టమే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ‘పక్కా కమర్షియల్’ బాక్సాఫీస్ వద్ద బాగా పుంజుకుంది. ఈ మధ్య కాలంలో ప్లాప్ టాక్ వచ్చిన ఒక సినిమాకి, ఇలా కలెక్షన్స్ స్టడీగా రావడం మొదటిసారి. అందుకే, ఇది నిజంగా షాకింగే. మొత్తానికి గోపీచంద్ ఈ సినిమా అపజయం నుంచి బయట పడినట్టే.
Also Read:Benefits Of Smiling: మనసారా నవ్వితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?