
Chiranjeevi- Gopichand Malineni: క్రాక్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని జోరు కొనసాగిస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి సక్సెస్ అయ్యింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి చెప్పుకోదగ్గ విజయం సాధించింది. బాలయ్యను ఫ్యాన్స్ కి నచ్చేలా ప్రజెంట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. బాలయ్య మాస్ ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సులు థియేటర్స్ దద్దరిల్లేలా చేశాయి. బాలయ్య వరుసగా మరో హిట్ నమోదు చేశాడు. ఇక సక్సెస్ ట్రాక్ మైంటైన్ చేసిన గోపీచంద్ మలినేని పెద్ద హీరోలపై కన్నేశారు. ఆయన నెక్స్ట్ చిరంజీవితో చేయాలని ఆశపడుతున్నారు.
ఈ క్రమంలో ఆయన్ని కలిసి కథ వినిపించారట. టాలీవుడ్ వర్గాల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం గోపీచంద్ మలినేని రీసెంట్ గా చిరంజీవిని కలిశారట. ఆయన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన కథను వినిపించాడట. గోపీచంద్ కథ పట్ల చిరంజీవి సానుకూలత వ్యక్తం చేశారట. కొద్దిరోజుల్లో తన నిర్ణయం చెబుతానన్నారట. ఈ ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయినట్లే అని భావిస్తున్న గోపీచంద్ మలినేని ఫుల్ ఖుషీగా ఉన్నారట.
కాగా గతంలో చిరంజీవి దర్శకుడు వెంకీ కుడుములకు హామీ ఇచ్చారు. వెంకీ కుడుములు తెరకెక్కించిన భీష్మ మూవీకి ఇంప్రెస్ అయిన చిరంజీవి కథ సిద్ధం చేయమన్నారు. అనంతరం వెంకీ కుడుముల చిరంజీవిని కలిసి స్క్రిప్ట్ నేరేట్ చేశారు. చిరంజీవి ఓకే చెప్పడంతో వీరి కాంబోలో మూవీ ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. అయితే వెంకీ కుడుములకు ఓకే చెప్పి చాలా కాలం అవుతున్నా… మరో అప్డేట్ లేదు. ఈ క్రమంలో సినిమా వుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి.

ఈ క్రమంలో చిరంజీవి నెక్స్ట్ వెంకీ కుడుముల, గోపీచంద్ మలినేని చిత్రాల్లో ఏది చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. తమిళ హిట్ చిత్రం వేదాళం రీమేక్ గా ఇది రూపొందుతోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా… కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేస్తున్నారు. కాగా వాల్తేరు వీరయ్య మూవీతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దర్శకుడు బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. చిరంజీవి మార్కెట్ స్టామినా ఏంటో చూపించింది. వాల్తేరు వీరయ్య వరల్డ్ వైడ్ వసూళ్ళ వర్షం కురిపించింది.
