https://oktelugu.com/

యాక్షన్ హీరోకి ప్లాప్స్ చాలా నేర్పించాయట !

ఓటమి వల్ల చాల కోల్పోతాం గాని, కొన్నిసార్లు ఓటమే మనకు ఎన్నో నేర్పిస్తోంది. యాక్షన్ హీరో గోపీచంద్‌ కి కూడా ప్లాప్ లు చాల నేర్పించాయట. గోపీచంద్‌ లో మార్పు తెచ్చిందట. మార్పు అంటే గెటప్ లో సెటప్ లో కాదు, మైండ్ సెట్ లో. యాక్షన్ తప్ప తనకు ఏది సెట్ అవ్వదని బలంగా నమ్మే ఈ మాస్ హీరోలో ఇప్పుడు యాక్షన్ అంటేనే ఓవర్ గా వద్దు అంటున్నాడని తెలుస్తోంది. ఇంతకీ అసలు విషయంలోకి […]

Written By:
  • admin
  • , Updated On : June 9, 2020 / 02:54 PM IST
    Follow us on


    ఓటమి వల్ల చాల కోల్పోతాం గాని, కొన్నిసార్లు ఓటమే మనకు ఎన్నో నేర్పిస్తోంది. యాక్షన్ హీరో గోపీచంద్‌ కి కూడా ప్లాప్ లు చాల నేర్పించాయట. గోపీచంద్‌ లో మార్పు తెచ్చిందట. మార్పు అంటే గెటప్ లో సెటప్ లో కాదు, మైండ్ సెట్ లో. యాక్షన్ తప్ప తనకు ఏది సెట్ అవ్వదని బలంగా నమ్మే ఈ మాస్ హీరోలో ఇప్పుడు యాక్షన్ అంటేనే ఓవర్ గా వద్దు అంటున్నాడని తెలుస్తోంది. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది డైరెక్షన్ లో స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా ‘సిటీమార్’ రాబోతుంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. మిల్క్ బ్యూటీ తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది.

    కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో సాగే ఈ చిత్రంలో కొన్ని ఓవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని, ఆ యాక్షన్ సీక్వెన్స్ ను తగ్గించమని.. అలాగే మూవీలో పక్కా కామెడీ సీక్వెన్సెస్ హైలెట్ అయ్యే విధంగా మూవీని ప్లాన్ చేయమని.. అలాగే బడ్జెట్ ను తగ్గిస్తే మంచిదని గోపీచంద్ సంపంత్ నందికి చెప్పడంతో, సంపత్ ఈ లాక్ డౌన్ ఖాళిలో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి చాణక్య రిజల్ట్ చూశాక.. సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టి అది రాబట్టలేక ఫైనల్ గా ప్లాప్ అనిపించుకోవడం ఎందుకని గోపీచంద్ ముందుగానే సాధ్యం అయినంతవరకు బడ్జెట్ తగ్గించమని కోరుతున్నాడు.

    ఇక సంపత్ నంది కూడా బడ్జెట్ తగ్గించడానికి స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. పైగా కామెడీ కోసం గోపీచంద్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని… సినిమా మొత్తం మీద గోపిచంద్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని ఆ పాత్రలోని వేరియేషన్స్ కారణంగానే మూవీలో కామెడీ బాగా వస్తోందట. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద సినిమా ప్లాప్ అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా కష్టపడుతున్నాడు.