బాలయ్య బర్త్‌డే స్పెషల్‌.. ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌!

అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మరే హీరోకు లేని హార్డ్‌ కోర్ ఫ్యాన్‌బేస్‌ బాలయ్య సొంతం. బాలయ్య తిట్టినా.. కొట్టినా సరే దగ్గరి నుంచి చూడాలని.. ఆయనతో ఫొటో దిగేందుకు పోటీ పడుతుంటారు. బాలకృష్ణ సినిమా రిలీజ్‌ అవుతున్నా.. ఆయన పుట్టిన రోజు వచ్చినా వాళ్ల హంగామా మామూలుగా ఉండదు. జూన్‌ పదిన.. అంటే రేపే ఆయన బర్త్‌డే. దీనికి మరో విశేషం ఉంది. […]

Written By: admin, Updated On : June 9, 2020 4:42 pm
Follow us on


అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మరే హీరోకు లేని హార్డ్‌ కోర్ ఫ్యాన్‌బేస్‌ బాలయ్య సొంతం. బాలయ్య తిట్టినా.. కొట్టినా సరే దగ్గరి నుంచి చూడాలని.. ఆయనతో ఫొటో దిగేందుకు పోటీ పడుతుంటారు. బాలకృష్ణ సినిమా రిలీజ్‌ అవుతున్నా.. ఆయన పుట్టిన రోజు వచ్చినా వాళ్ల హంగామా మామూలుగా ఉండదు. జూన్‌ పదిన.. అంటే రేపే ఆయన బర్త్‌డే. దీనికి మరో విశేషం ఉంది. ఎందుకంటే ఆయన 60వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు. అంటే షష్టి పూర్తి వేడుక అన్నమాట. దాంతో, అభిమానుల సందడి ఇప్పటికే మొదలైంది. ఏపీలో అయితే బాలయ్య భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. బాలకృష్ణ బర్త్‌డే ‘కామన్‌ డీపీ’ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా నేపథ్యంలో ఒక్క చోట ఎక్కువ మంది గుమికూడే పరిస్థితి లేకపోవడంతో ఈ వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు‌ ఇప్పటికే ఫ్యాన్స్‌ అన్నీ సిద్ధం చేశారు.

తన పుట్టిన రోజు సందర్భంగా ఇంత చేస్తున్న ఫ్యాన్స్‌కు తన వైపు నుంచి కూడా అదే రేంజ్‌లో ట్రీట్‌ ఇచ్చేందుకు బాలయ్య కూడా రెడీ అయ్యారు. ఈ రోజే డబుల్ ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. బర్త్‌డే సందర్భంగా అభిమానుల కోసం బాలయ్య స్వయంగా పాడిన ఓ పాటను ఈ రోజు సాయంత్రం 5.03 నిమిషాలకు పాట రిలీజ్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఎన్‌బీకే ఫిల్మ్స్‌ చానల్లో ఈ పాట అందుబాటులోకి వస్తుంది. ఆపై, మరో రెండు గంటల్లోనే ఇంకో సర్ప్రైజ్‌ రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న తదుపరి చిత్రం నుంచి ఆ సర్ప్రైజ్ రానుంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు సింహ, లెజెండ్ భారీ విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌ హిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దీన్ని ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్‌ మ్యూజిక్ డైరెక్టర్. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌ ఈజ్‌ బ్యాంక్.. #BB3 అంటూ ఓ పోస్టర్ ట్వీట్‌ చేసిన ద్వారకా క్రియేషన్స్‌ ఈ రోజు రాత్రి 7.09 గంటలకు ఫస్ట్‌ రోర్ (తొలి గర్జన) అని ప్రకటించింది. అంటే.. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది.