https://oktelugu.com/

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సలార్’. కాగా కేవలం ఫస్ట్ ‌లుక్‌ తోనే ‘సలార్‌’ తన రేంజ్ ఏంటో పాన్ ఇండియా రేంజ్ లో చూపించింది. అప్పటి నుండి ఈ సినిమాకు సంబంధించి తర్వాతి ప్రకటన ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఆశగా చూసిన ఎదురుచూపులకు మొత్తానికి ఫలితం వచ్చేసింది. తాజాగా మేకర్స్ ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు […]

Written By:
  • admin
  • , Updated On : February 28, 2021 / 05:22 PM IST
    Follow us on


    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సలార్’. కాగా కేవలం ఫస్ట్ ‌లుక్‌ తోనే ‘సలార్‌’ తన రేంజ్ ఏంటో పాన్ ఇండియా రేంజ్ లో చూపించింది. అప్పటి నుండి ఈ సినిమాకు సంబంధించి తర్వాతి ప్రకటన ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఆశగా చూసిన ఎదురుచూపులకు మొత్తానికి ఫలితం వచ్చేసింది. తాజాగా మేకర్స్ ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు..

    Also Read: ప్చ్.. ఆ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు !

    అన్నట్లు ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. గోదావరి ఖనిలో వేసిన భారీసెట్‌ లో షూట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్‌ లోనే బొగ్గు గనుల్లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను తీశారు. దానికి సంబంధించిన షూటింగ్ ఫొటోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేయనుంది. క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఎలాగూ ప్రభాస్ సినిమాల్లో యాక్షన్ అంటే.. నేషనల్ రేంజ్ లో ఉంటుంది.

    Also Read: మాజీ బ్యూటీ నుండి బోల్డ్ వెబ్ సిరీస్ !

    మరి ఏకంగా యాక్షన్ డైరెక్టర్స్ లోనే నెంబర్ వన్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ యాక్షన్ సినిమా అంటే ఇక ఏ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాకి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్‌’తో డైరెక్టర్‌గా సత్తా నిరూపించుకున్న ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాని అంతకుమించిన భారీ విజువల్స్ తో తీస్తున్నాడట. మరోపక్క ‘బాహుబలి’తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ హీరోగా ఈ సినిమా రావడంతో ఈ సినిమా రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్