https://oktelugu.com/

‘ఆచార్య’ పై మెగాస్టార్ కి అనుమానం !

మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా ఒప్పుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ సినిమా ఒప్పుకుంటారు. అయితే, ఆచార్య విషయంలో మాత్రం చిరు పెద్దగా ఆలోచించలేదట. కారణం, కొరటాల. ప్లాప్ లేని డైరెక్టర్, పైగా హిట్ తప్ప మరొకటి తెలియని డైరెక్టర్. దానికితోడు మంచి మెసేజ్ సినిమాలు తీస్తాడు అనే గుడ్ నేమ్. ఇవన్నీ చిరును ఎక్కువ ఆలోచించుకోకుండా చేసాయి. చివరకు సినిమా పూర్తి అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ టైంలో ఆచార్య పై చిరుకు అనుమానం మొదలైంది. […]

Written By:
  • admin
  • , Updated On : February 28, 2021 / 05:58 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా ఒప్పుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ సినిమా ఒప్పుకుంటారు. అయితే, ఆచార్య విషయంలో మాత్రం చిరు పెద్దగా ఆలోచించలేదట. కారణం, కొరటాల. ప్లాప్ లేని డైరెక్టర్, పైగా హిట్ తప్ప మరొకటి తెలియని డైరెక్టర్. దానికితోడు మంచి మెసేజ్ సినిమాలు తీస్తాడు అనే గుడ్ నేమ్. ఇవన్నీ చిరును ఎక్కువ ఆలోచించుకోకుండా చేసాయి. చివరకు సినిమా పూర్తి అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ టైంలో ఆచార్య పై చిరుకు అనుమానం మొదలైంది.

    Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

    ఎక్కడో అవుట్ డేటెడ్ డైలాగ్ లు, దానికిమించిన స్లో సాగే స్క్రీన్ ప్లే.. మొత్తంగా చిరులో ఇప్పుడు ఆచార్య పై అసలు నమ్మకం లేదట. ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినిమా కాబట్టి.. కాంబినేషన్ కి క్రేజ్ ఉంటుంది, ఓపెనింగ్స్ ఉంటాయి. మరి సినిమా తేడా కొడితే సినిమా కొన్నుకున్న బయ్యర్ల పరిస్థితి ఏమిటి ? అసలు నిర్మాత పరిస్థితి ఏమిటి ? అసలుకే సినిమాకు ఓవర్ బడ్జెట్ అయింది. అందుకే ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక, సినిమా మొత్తం చూసి, కొన్ని సీన్స్ ను రీషూట్ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నాడట.

    Also Read: ప్చ్.. ఆ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు !

    ఈ క్రమంలోనే చిరు షూటింగ్ కు విరామం లేకుండా షూట్ లో పాల్గొంటున్నాడట. ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే కొరటాలకు చిరు చెప్పారట. దాంతో కొరటాల కూడా గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నాడు. మరి భారీ అంచనాల మధ్య విడుదలు కానున్న ‘ఆచార్య’ ఆ అంచనాలను అందుకోవాలంటే మాత్రం, సినిమాలో భారీ కంటెంట్ ఉండాలి. మరి చివర్లో చిరు ఎలాంటి కంటెంట్ పెడతారో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్