https://oktelugu.com/

ప్చ్.. ఆ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు !

టాలీవుడ్ లో టాలెంట్ కు కొదవ లేదు. ముఖ్యంగా మ్యాటర్ ఉన్న డైరెక్టర్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అందుకే స్టార్ హీరోలు కూడా స్టార్ డైరెక్టర్స్ కోసం ఎదురుచూడకుండా.. విషయం ఉందనుకుంటే.. కొత్త కుర్రాళ్ళతో కూడా సినిమాలు చేసుకంటూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే మహేష్, పరుశురామ్ తో సినిమా చేస్తున్నాడు. దాంతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి కూడా వంశీ పైడిపల్లి వంటి దర్శకులు మరో సినిమా కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది. Also […]

Written By:
  • admin
  • , Updated On : February 28, 2021 / 05:15 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో టాలెంట్ కు కొదవ లేదు. ముఖ్యంగా మ్యాటర్ ఉన్న డైరెక్టర్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అందుకే స్టార్ హీరోలు కూడా స్టార్ డైరెక్టర్స్ కోసం ఎదురుచూడకుండా.. విషయం ఉందనుకుంటే.. కొత్త కుర్రాళ్ళతో కూడా సినిమాలు చేసుకంటూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే మహేష్, పరుశురామ్ తో సినిమా చేస్తున్నాడు. దాంతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి కూడా వంశీ పైడిపల్లి వంటి దర్శకులు మరో సినిమా కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది.

    Also Read: మాజీ బ్యూటీ నుండి బోల్డ్ వెబ్ సిరీస్ !

    తమ కథకు తగ్గ స్టార్ హీరో దొరకక, చిన్న హీరోలతో సినిమాలు చేయలేక టైమ్ పాస్ చేస్తూ అల ఖాళీగా ఉండిపోతున్నారు చాలామంది. ఈ కోవలోకే వస్తాడు దర్శకుడు మారుతీ. టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ దర్శకుడిగా పేరున్న మారుతీ హిట్స్ కొట్టి కూడా సరైన హీరోని పట్టలేక గోపీచంద్ లాంటి ప్లాప్ లో ఉన్న హీరోతో సినిమా చేసుకోవాల్సి వస్తోంది. లేకపోతే ప్రతిరోజూ పండగే మూవీతో మారుతీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించినా.. ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వలేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    సాయి ధరమ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన ప్రతిరోజూ పండగే లాంటి సినిమా తరువాత మారుతి పెద్ద హీరో కోసం ప్రయత్నాలు చేసి, విసిగిపోయి గోపిచంద్ తో సినిమా ఒప్పుకున్నాడు. నిజానికి ఈ మూవీ సక్సెస్ తరువాత ఏకంగా అల్లు అర్జున్ తో మూవీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు మారుతీ. మెగా కాంపౌండ్ తో మంచి అనుబంధం ఉన్నా.. ఎందుకో ఆ ప్రయత్నాలు ఏవి కలిసిరాలేదు. స్టార్ హీరోతో మూవీ చేసి.. టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లాలన్న మారుతీ కోరిక మాత్రం ఇప్పట్లో తీరేలా కనబడటం లేదు.