RRR Movie : ఆర్ఆర్ఆర్.. ఈ పేరు వింటే చాలు.. సినీ ప్రపంచానికి ఎదో తెలియని ఎనర్జీ, ఉత్సాహం వస్తాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వేయి కళ్ల తోటి ఎదురుచూస్తున్నారు. ఇప్పటి పలుమార్లు పోస్ట్ పోన్ అయిన ఈ మూవీ.. ఎట్టకేటకు ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది మూవీ యూనిట్. ఈ మూవీకి సంబంధించి స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు ఉంటాయో లేదో నని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఒక రోజు ముందే ప్రీమియర్ షోస్ ఉండకపోవచ్చని సమాచారం. కానీ, రిలీజ్ రోజున తెల్లవారుజామున స్పెషల్ షోలు ఉంటాయనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. బాహుబలి మూవీ అనంతరం ఈ మూవీని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రూపొందించారు.

ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ వంటి ఇద్దరు పెద్దస్టార్స్ యాక్ట్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫస్ట్ డేనే మూవీ కలెక్షన్స్ రూ.100 కోట్లు దాటుతుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పెషల్ గా కొంత మేర టికెట్లు రేట్లు పెంచుకునేందుకు చాన్స్ ఇచ్చింది. ఇది ఏపీ డ్రిస్టిబ్యూటర్స్ కాస్త ఆనందించే విషయం. ఇక ఈ మూవీ ఫ్యాన్స్ స్పెషల్ షోస్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read: OKTelugu MovieTime : టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్
ఈ మూవీకి సంబంధించి నైజాం హక్కులను దిల్ రాజు నిర్మాణ సంస్థ దక్కించుకోన్నారు. దీంతో స్పెషల్ షోల కోసం ఆయన ఆఫీస్ వద్ద ఫ్యాన్స్ స్పెషల్ షోలకు సంబంధించిన టికెట్ల కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ప్రత్యేకమైన షోలకు సంబంధించి హక్కులను గోపీచంద్ అనే మరొక డిస్ట్రిబ్యూటర్‌కు ఇచ్చారని టాక్.

గతంలో ఆయన వలిమై మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ముందస్తుగానే పోలీస్ ఉన్నతాధికారులకు ప్రత్యేకమైన షోలకు సంబంధించి వివరాలను వివరించినట్టు సమాచారం. కూకట్‌పల్లి లోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, అర్జున్ థియేటర్స్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. మూసాపేట్ లోని శ్రీ రాములు థియేటర్ లోనూ బోరబండలోని విజేత థియేటర్‌లోనూ స్పెషల్ షోలు ఉండనున్నాయి.
Also Read: Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్