https://oktelugu.com/

మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. రీజన్ అదే !

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’తో విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ప్లాన్ చేసిన సినిమా ఉంటుందా ? అసలు ‘భారతీయుడు 2’ వివాదం నుండి శంకర్ లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉందా ? ఇలా మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా అనేక అనుమానాలతో ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ కోసం తెగ ఎదురు చూశారు. వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. నేషనల్ స్టార్ డైరెక్టర్ శంకర్ […]

Written By:
  • admin
  • , Updated On : July 5, 2021 / 03:17 PM IST
    Follow us on

    మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’తో విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ప్లాన్ చేసిన సినిమా ఉంటుందా ? అసలు ‘భారతీయుడు 2’ వివాదం నుండి శంకర్ లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉందా ? ఇలా మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా అనేక అనుమానాలతో ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ కోసం తెగ ఎదురు చూశారు.

    వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. నేషనల్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో తానూ చేస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా పై తాజాగా రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ.. ‘మాకు (దిల్ రాజుతో సహా) నిన్న చెన్నైలో అద్భుతంగా గడిచింది. ముఖ్యంగా గొప్ప ఆతిథ్యమిచ్చిన శంకర్ సర్ కి, వారి మీ కుటుంబానికి మా ధన్యవాదాలు. శంకర్ సర్ మన సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. అతి త్వరలోనే అన్ని వివరాలతో ముందుకొస్తామని ఆశిస్తున్నాను’ అంటూ చరణ్ పోస్ట్ పెట్టాడు.

    ఇక ఈ పాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు. సాంగ్స్ ను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక చరణ్ – శంకర్ కాంబినేషన్ తొలిసారి కావడంతో ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా మంచి బజ్ ఉంటుంది. అన్నిటికీ మించి చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తోన్న సినిమా ఇది.

    అందుకే అందరిలోనూ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను గమనించే బడ్జెట్ విషయంలో చాల జాగ్రత్తగా ఉండే ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా కోసం అసలు బడ్జెట్ పై ఎలాంటి ఆంక్షలు లేకుండా సినిమా చేయడానికి తెగ ఉత్సాహ పడుతున్నాడు. మొత్తానికి మెగా అభిమానులు ఈ సినిమా సెట్ అవ్వడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.