https://oktelugu.com/

కారు కొనేవాళ్లకు అలర్ట్.. తక్కువ వడ్డీకే రుణాలిచ్చే బ్యాంకులివే..?

దేశంలో నివశించే వాళ్లలో ఎక్కువమంది కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కొంతమంది దాచుకున్న డబ్బులతో కారును కొనుగోలు చేస్తుంటే మరి కొందరు మాత్రం బ్యాంక్ లోన్ పొంది కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. కొత్తగా కారును కొనుగోలు చేసేవాళ్ల కోసం కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తుండటం గమనార్హం. ఏయే బ్యాంకుల్లో తక్కువ వడ్డీరేటు ఉందో తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 5, 2021 / 03:11 PM IST
    Follow us on

    దేశంలో నివశించే వాళ్లలో ఎక్కువమంది కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కొంతమంది దాచుకున్న డబ్బులతో కారును కొనుగోలు చేస్తుంటే మరి కొందరు మాత్రం బ్యాంక్ లోన్ పొంది కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. కొత్తగా కారును కొనుగోలు చేసేవాళ్ల కోసం కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తుండటం గమనార్హం. ఏయే బ్యాంకుల్లో తక్కువ వడ్డీరేటు ఉందో తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కారు కొనుగోలుపై 7.5 శాతం నుంచి వడ్డీని వసూలు చేస్తుండటం గమనార్హం. ఎస్బీఐలో కారు రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు 0.4 శాతంగా ఉండటం గమనార్హం. ప్రముఖ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.55 శాతం నుంచి కారు రుణాలకు వడ్డీ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ప్రాసెసింగ్ ఫీజు 1500 రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

    ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీరేటు 7.9 శాతం నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ లో ప్రాసెసింగ్ ఫీజు 3500 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు ఉంటుందని సమాచారం. యాక్సిస్ బ్యాంకులో వడ్డీరేటు 8.65 శాతం నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విషయానికి వస్తే ఈ బ్యాంక్ లో కారు రుణాలకు వడ్డీ రేటు 7.95 శాతం నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ఈ బ్యాంక్ లో కారు రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు 3,500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుందని సమాచారం.