Karthika Deepam- 2: వంటలక్క, డాక్టర్ బాబు… తెలుగు సీరియల్స్ హిస్టరీలో ఎన్నటికీ నిలిచిపోయే పాత్రలు ఇవి. ఐదున్నరేళ్లు సీరియల్ లవర్స్ ని కార్తీకదీపం నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేసింది. వంటలక్క, డాక్టర్ బాబుపై వేలల్లో మీమ్స్, స్పూఫ్స్ వచ్చాయి. వెండితెర మీద కూడా ఈ పాత్రల గురించి చర్చ జరిగింది. అంతగా కార్తీకదీపం ప్రాచుర్యం పొందింది. కార్తీకదీపం సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఏకంగా ఇండియాలోనే అత్యధిక టీఆర్పీ సాధించిన సీరియల్ గా కార్తీకదీపం నిలిచింది. ఒక సీరియల్ కి 10 టీఆర్పీ రావడమే గొప్ప విషయం. అలాంటిది కార్తీక దీపం 22 టీఆర్పీ కూడా సాధించింది.

వరల్డ్ బిగ్ బిగ్గెస్ట్ షోగా చెప్పుకునే బిగ్ బాస్ కి కూడా ఈ రేంజ్ రేటింగ్ రాలేదు. అందుకే సీరియల్స్ లో కార్తీకదీపం రారాజుగా అని చెప్పొచ్చు. మూడేళ్ళలో కథ ముగించాల్సింది మరో రెండేళ్లు పాడించారు. దాదాపు 1500 లకు పైగా ఎపిసోడ్స్ కి కార్తీక దీపం చేరింది. గత ఏడాది కొంచెం కొత్తగా ట్రై చేద్దామని డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్స్ చంపేశారు. వారి ఇద్దరు కూతుళ్లను యంగ్ ఏజ్ లోకి తీసుకొచ్చి సీరియల్ నడిపించే ప్రయత్నం చేశారు.
వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత క్యారెక్టర్స్ లేకుండా కార్తీక దీపం సీరియల్ ని ప్రేక్షకులు ఊహించుకోలేరని టీఆర్పీ రుజువు చేసింది. ఒక్కసారిగా కార్తీక దీపం వ్యూవర్స్ తగ్గిపోయారు. తప్పు చేశామని తెలుసుకొని మళ్ళీ వెనక్కిపోయి వంటలక్క, డాక్టర్ బాబు బ్రతికే ఉన్నారని చెప్పారు. వారిని రంగంలోకి దించాక టీఆర్పీ లైన్లోకి వచ్చింది. కారణం తెలియదు కానీ కార్తీక దీపం సీరియల్ కి ఎండ్ కార్డు వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆడియన్స్ కి ముందుగానే తెలియజేశారు. ఫలానా తేదీన కార్తీక దీపం సీరియల్ ముగిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ క్రమంలో కార్తీక దీపంలో మెయిన్ రోల్స్ చేసిన నిరుపమ్ పరిటాల, ప్రేమీ విశ్వనాథ్, శోభా శెట్టిలతో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. కాగా కార్తీక దీపం కి కొనసాగింపుగా కార్తీక దీపం 2 ఉందని టీమ్ హింట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పార్ట్ 2 తీసుకొచ్చి వంటలక్క, డాక్టర్ బాబులను మా ఇంటికి తీసుకురండని కోరుకుంటున్నారు. కాగా ఈ సీరియల్ లో మెయిన్ అట్రాక్షన్ ప్రేమీ విశ్వనాథ్. చాలా మంది ఈమె తెలుగు నటి అనుకుంటారు. కానీ ఆమెది కేరళ. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్ డైరెక్టర్ గా ఉన్నారు.