Venkatesh-Shailesh kolanu : విక్టరీ వెంకటేష్ కాంబినేషన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తారు. ఆ నలుగురిలో ఒకడిగా దశాబ్దాలపాటు సిల్వర్ స్క్రీన్ ని ఏలారు. చిరు, బాలయ్య, నాగార్జునలతో పోల్చుకుంటే వెంకీ హిట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. ఆయన మినిమమ్ గ్యారంటీ హీరో. తన మార్కెట్, స్టార్డంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్నాడు. యంగ్ హీరోలతో మల్టీస్టారర్స్ చేస్తున్న ఏకైక స్టార్ హీరో. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించే వెంకటేష్ వెండితెరపై కనిపిస్తే చాలు ఆడియన్స్ తెలియని అనుభూతి పొందుతారు.

ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న వెంకీ క్రైమ్ డ్రామాలు కూడా చేశారు. దృశ్యం, దృశ్యం-2 ఆ కోవకు చెందిన చిత్రాలే. అవి మలయాళ రీమేక్స్ అయినప్పటికీ వెంకీ ఇమేజ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాయి. అందుకే ఆయనకు విజయాలు దక్కాయి. బెస్ట్ థ్రిల్లర్స్ గా ఆడియన్స్ మనసులు దోచిన దృశ్యం సిరీస్ చేసిన వెంకీ… ‘హిట్’ సిరీస్ లో భాగం అయ్యారంటున్నారు. నేడు వెంకీ కొత్త మూవీ ప్రకటన చేశారు. దర్శకుడు శైలేష్ కొలనుతో మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రీ అనౌస్మెంట్ పోస్టర్ ఆసక్తి రేపింది. చేతిలో రివాల్వర్ పట్టుకొని వెంకీ నిల్చొని ఉన్నాడు. ఇంటెన్స్ థీమ్ తో కూడిన ఆ పోస్టర్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. శైలేష్ కొలను డైరెక్షన్ తెరకెక్కుతున్న మూవీ కావడంతో… ఇది కచ్చితంగా క్రైమ్ థ్రిల్లర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరికొందరు ఇది హిట్ వర్స్ లో భాగం కావొచ్చని అంటున్నారు. శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ ఫస్ట్ కేస్ లో విశ్వక్ సేన్ హీరోగా చేశారు. ఇక హిట్ సెకండ్ కేస్ లో అడివి శేష్ భాగమయ్యారు. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాయి.
హిట్ థర్డ్ కేస్ లో నాని నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మధ్యలో శైలేష్ కొలను హీరో వెంకీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో వెంకీ 75వ ప్రాజెక్ట్ హిట్ వర్స్ లో భాగమన్న వాదనలు కొట్టిపారేయలేం అంటున్నారు. జనవరి 25న పూర్తి వివరాలతో కూడిన ప్రకటన చేయనున్నారు. ఆ రోజు స్పష్టత వచ్చే సూచనలున్నాయి.. ఏది ఏమైనా వెంకీ-శైలేష్ కొలను కాంబినేషన్ ఫ్యాన్స్ కి చాలా కొత్తగా తోచింది. ఓ న్యూ ఏజ్ క్రైమ్ డ్రామా చూడొచ్చని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. శ్యామ్ సింగరాయ్ నిర్మాతలు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
#Venky75 | Venkatesh – Sailesh Kolanu (HIT Series) pic.twitter.com/5kEcEulLz4
— Christopher Kanagaraj (@Chrissuccess) January 23, 2023