Good Bad Ugly Teaser :సౌత్ ఇండియా లో విపరీతమైన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరు అజిత్(Thala Ajith). తమిళనాట ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. హిట్స్/ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా చెక్కుచెదరని క్రేజ్ తో కొనసాగుతున్నాడు. అయితే తమ అభిమాన హీరో తన కెపాసిటీ కి తగ్గ బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ అజిత్ నుండి మాత్రం సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగలడం లేదు. విశ్వాసం, తూనీవు వంటి చిత్రాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అయినప్పటికీ, అవి కేవలం అజిత్ క్రేజ్ వల్ల హిట్ అయ్యినవే కానీ, సినిమా బాగుండడం వల్ల హిట్ అయ్యినవి కావు. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యే సినిమాలు అజిత్ తీసి చాలా కాలమే అయ్యింది. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘విడాముయార్చి'(Vidamuyarchi Movie) కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
Also Read : ‘విడాముయార్చి’ ని దాటేసిన ‘డ్రాగన్’..మొదటిరోజు ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే నోరెళ్లబెడుతారు!
అభిమానులు ఈ సినిమా ఫలితం పట్ల చాలా తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ ఏప్రిల్ 10 న విడుదల కాబోతున్న ‘గుడ్..బ్యాడ్..అగ్లీ'(Good..Bad..Ugly) చిత్రం మీదనే ఉంది. ‘పుష్ప 2’ మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పై తమిళనాడు లో విపరీతమైన క్రేజ్ ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో అజిత్ కం బ్యాక్ అవుతాడని అభిమానులతో పాటు ట్రేడ్ కూడా నమ్ముతుంది. అందుకే ఈ సినిమాకి తమిళనాడు లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ జరిగింది. అభిమానుల్లో కాకుండా, సాధారణ ప్రేక్షకుల్లో అజిత్ సినిమాపై అంచనాలు ఏర్పడడం చాలా కాలం తర్వాత ఈ సినిమాకే జరిగింది. తెలుగు లో కూడా చాలా కాలం తర్వాత అజిత్ సినిమాకి బజ్ ఏర్పడింది అంటే సాధారణమైన విషయం కాదు. కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు మేకర్స్.
ఈ టీజర్ చూసిన తర్వాత అభిమానులు అజిత్ నుండి ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో, అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ‘నువ్వు ఎంత మంచివాడివి అనేది అనవసరం..ఈ లోకం నిన్ను చెడ్డవాడిని చేస్తుంది’ వంటి డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చాలా కాలం తర్వాత అజిత్ ని యంగ్ లుక్ లో కొన్ని షాట్స్ లో చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ షాట్స్ లో నిజంగా ఆయన వింటేజ్ రోజులను గుర్తు చేసాడు. అజిత్ మార్క్ ఎనర్జీ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది. చూస్తుంటే ఈ సినిమాతో అజిత్ ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. అయితే కేవలం తమిళ వెర్షన్ టీజర్ మాత్రమే విడుదల చేసారు కానీ, తెలుగు వెర్షన్ టీజర్ ని మాత్రం విడుదల చేయలేదు. త్వరలోనే తెలుగు టీజర్ కి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
