Vidamuyarchi , Dragon
Vidamuyarchi and Dragon : ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు, మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కలెక్షన్స్ విషయంలో చాలా తేడా ఉండేది. స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాలకు వచ్చేంత వసూళ్ళలో, సగం కూడా మీడియం రేంజ్ హీరోలకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు స్టార్ హీరో సూపర్ హిట్ సినిమాలకు ఏ రేంజ్ లో వసూళ్లు వసూళ్లను రాబడుతున్నాయో, చిన్న హీరోల సినిమాలు కూడా అదే రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి. ఎన్నో ఉదాహరణలు ఇటీవల కాలంలో మనం చూసాము. హనుమాన్, అమరన్ వంటి చిత్రాలు అందుకు ఒక ఉదాహరణ. ఇప్పుడు రీసెంట్ గా లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon) చిత్రం కూడా మరో ఉదాహరణగా నిల్చింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.
ఈ రెండు భాషలకు కలిపి మొదటి రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 2 లక్షల 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. తమిళ సూపర్ స్టార్ అజిత్(Thala Ajith) లేటెస్ట్ చిత్రం ‘విడాముయార్చి'(Vidaamuyarchi Movie) కి కేవలం 2 లక్షల 20 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోవడం గమనార్హం. ఒక సూపర్ స్టార్ సినిమాని కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న కుర్ర హీరో డామినేట్ చేయడం, కచ్చితంగా చర్చించుకోదగ్గ విషయమే. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీస్తే, హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు అనేది చూడరు, థియేటర్స్ కి క్యూలు కట్టేస్తారు అనడానికి నిదర్శనం ఈ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలకు కలిపి 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
మొదటిరోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి కళ్ళు చెదిరే వసూళ్లు వస్తున్నాయి. బుక్ మై షో యాప్ లో ప్రస్తుతం గంటకు తమిళ వెర్షన్ లో 13 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతుండగా, తెలుగు లో గంటకు 3 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. రెండు భాషలకు కలిపి గంటకు 16 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి అన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు. ఇదే రేంజ్ ఊపుతో ఈ చిత్రం ముందుకు దూసుకుపోతే కచ్చితంగా వరల్డ్ వైడ్ గా 100 నుండి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంటుంది. అజిత్ ‘విడాముయార్చి’ చిత్రానికి క్లోజింగ్ లో 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఈ సినిమా ఆ వసూళ్లను అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎన్ని మ్యాజిక్స్ ని క్రియేట్ చేయబోతుంది అనేది.