Good Bad Ugly Collection: నిన్నగాక మొన్న విడుదల అయ్యినట్టు అనిపిస్తున్న తమిళ హీరో అజిత్(Thala Ajith Kumar) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) చిత్రం అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిసింది. 5 రోజుల భారీ వీకెండ్ తర్వాత ఈ సినిమా వసూళ్ళలో భారీ డ్రాప్స్ ఉంటాయని అందరూ అనుకున్నారు కానీ. డీసెంట్ స్థాయి డ్రాప్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది. నిన్న కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 65 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వర్కింగ్ డేస్ ఇది చాలా డీసెంట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. విడుదలకు ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని భాషలకు కలిపి 116 కోట్ల రూపాయలకు జరిగింది. మరి మొదటి వారం లో ఎంత రికవరీ చేసిందో ఒకసారి చూద్దాం.
Also Read: తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో.. ఈ బ్యూటీ ఎవరంటే..
అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఏమిటంటే ఈ సినిమాకు తెలుగు వసూళ్లు చాలా స్టడీ గా ఉన్నాయి. కానీ తమిళ వెర్షన్ వసూళ్లు రోజురోజుకి తగ్గుతూ వస్తున్నాయి. తెలుగు వెర్షన్ లో ఆరవ రోజు 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, 70 వ రోజు కూడా 40 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంత స్టడీ గా గ్రాస్ వసూళ్లు రావడం అనేది ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా జరగలేదు. తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకు ఇప్పటి వరకు 5 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ దాదాపుగా రెండు కోట్ల 60 లక్షలు ఉంటుంది. ఇంకో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక తమిళనాడు ప్రాంతంలో ఈ చిత్రానికి మొదటి వారం 113 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ వసూళ్లను బట్టి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఈ ప్రాంతంలో 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది తెలియనుంది. అదే విధంగా కర్ణాటక ప్రాంతంలో 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కేరళలో 3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 56 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 191 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 93 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కి మరో 23 కోట్లు రాబట్టాల్సి ఉంది.
Also Read: రీ రిలీజ్ కి సిద్దమైన ‘యమదొంగ’..’గబ్బర్ సింగ్’ రికార్డ్స్ బద్దలు కానున్నాయా?