Good Bad Ugly : రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను సొంతం చేసుకోలేకపోయాయి. కనీసం ఓపెనింగ్ వసూళ్లు కూడా రాలేదు. ఇప్పటికీ కూడా ఆడియన్స్ కి 12 రోజుల క్రితం విడుదలైన తమిళ హీరో అజిత్(Thala Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రమే మొదటి ఛాయస్ గా నిల్చింది. సోమవారం రోజున ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది చాలా డీసెంట్ హోల్డ్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. కేవలం ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా, మొదటి వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా డ్రాప్ అవుతాయని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం 12 వ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టడం చూస్తుంటే, ఈ సినిమా లాంగ్ రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
Also Raed : 11వ రోజు చరిత్ర సృష్టించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’..ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 12 వ రోజున 3 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఓవరాల్ వరల్డ్ వైడ్ వసూళ్లు 223 కోట్ల రూపాయిల గ్రాస్ కి చేరుకుంది. అజిత్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రమ్ నిల్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 116 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. 223 కోట్ల రూపాయిల గ్రాస్ కి గానూ, ఈ చిత్రానికి 109 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా కచ్చితంగా మరో 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి, మరో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చు. ఈ వీకెండ్ నుండి బయ్యర్స్ కి భారీ లాభాలు మొదలు కానున్నాయి. కానీ తెలుగు వెర్షన్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే.
ఇప్పటి వరకు ఈ చిత్రానికి మన తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 5 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఇంకా రెండు కోట్ల షేర్ వసూళ్లు కచ్చితంగా రాబట్టాలి, ఈ వీకెండ్ తో దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే. ఇక తమిళనాడు లో ఈ చిత్రానికి 12 రోజుల్లో 138 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లో 60 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, ఈ వీకెండ్ తో మరో 5 కోట్ల రూపాయిల గ్రాస్ ఓవర్సీస్ లో అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 260 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : ‘డ్రాగన్’ ని అందుకోలేకపోయిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’..అజిత్ కి మరో అవమానం!