Good Bad Ugly : తమిళ హీరో అజిత్(Thala Ajith) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) తమిళనాడు లో సెన్సేషనల్ రన్ ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. కానీ మిగిలిన ప్రాంతాల్లో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ముఖ్యంగా అజిత్ గత చిత్రాల ప్రభావం కారణంగా ఆయన ఓవర్సీస్ మార్కెట్ కి పడిన చిల్లు మామూలుది కాదు. 11 రోజులకు గాను ఈ చిత్రానికి ఓవర్సీస్ లో కేవలం 59 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది విజయ్ గత చిత్రం ‘గోట్’ మొదటిరోజు వసూళ్లతో సమానం అన్నమాట. తమిళనాడు లో వచినట్టుగానే, మిగిలిన ప్రాంతాల నుండి కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చి ఉంటే 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది. కానీ ఇప్పుడు 260 కోట్ల రూపాయిల గ్రాస్ వద్ద థియేట్రికల్ రన్ ఆగిపోయేలా అనిపిస్తుంది.
Also Read : అర్జున్ S/O వైజయంతి’ 3 రోజుల వసూళ్లు..టాలీవుడ్ కి మరో డిజాస్టర్!
ఇది ఇలా ఉండగా 11వ రోజు మాత్రం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసుకుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళు అందిసున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 11వ రోజున 8 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 4 కోట్ల 45 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇందులో 90 శాతం వసూళ్లు తమిళనాడు నుండి వచ్చినవే. అదే విధంగా తెలుగు లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయిల గ్రాస్, 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మరో రెండు కోట్ల రూపాయిల షేర్ ని రాబడితే తెలుగు లో బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుంటుంది. అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు. అదే విధంగా కర్ణాటక లో 13 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళ నుండి 3 కోట్ల 35 లక్షలు వచ్చాయి.
ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషలకు కలిపి 219 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 107 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 9 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. గత వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకున్నారు కానీ, ఇంకా ఆ టార్గెట్ ని అందుకోలేదు. ఈ వారం ఆ మార్కుని అందుకోవచ్చు. లాభాలు వస్తాయి కానీ, భారీ లాభాలు రావడం మాత్రం కష్టమే. తమిళనాడు లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 135 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో 30 కోట్ల గ్రాస్ అదనంగా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు వెయ్యి నుండి రెండు వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
Also Read : మే నెల నుండి ‘ఓజీ’..ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్లాస్టింగ్ న్యూస్!