Good Bad Ugly : తమిళ హీరో అజిత్(Thala Ajith) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అజిత్ నుండి అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ ని అయితే కోరుకుంటారో, అలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని జొప్పించి, ఈ చిత్రాన్ని ప్రారంభం నుండి ఎండింగ్ వరకు అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ గా మలిచి అందించాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. అందుకే తమిళనాడు బాక్స్ ఆఫీస్ విడుదల రోజు నుండి నేటి వరకు షేక్ అవుతూనే ఉంది. రోజు రోజుకి వసూళ్లు పెరుగుతూ బయ్యర్స్ కి కళ్ళు చెదిరే లాభాలను తీసుకొచ్చే దిశగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అడుగులు వేస్తుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 8 రోజులకు 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు చాలా దగ్గరగా వచ్చిందట.
Also Read : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదటి వారం వసూళ్లు..తెలుగు లో దుమ్ములేపేసిందిగా!
కానీ బ్రేక్ ఈవెన్ కి మాత్రం ఈ సినిమా ఇంకా ఆమడ దూరంలోనే ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల రూపాయలకు వివిధ ప్రాంతాల నుండి బయ్యర్స్ కొనుగోలు చేసారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 196 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 95 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడితే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టదు.కచ్చితంగా ఈ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ట్రెండ్ చూస్తుంటే కచ్చితంగా ఈ వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని పొందేలా ఉంది ఈ చిత్రం. మన తెలుగు లో అయితే 200 కోట్ల రూపాయిల గ్రాస్ కి కనీసం 112 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేవి.
కానీ తమిళనాడు లో ఎంత గ్యాప్ ఉందో మీరే చూడండి. మరోపక్క వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి ఓవర్సీస్ లో వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇప్పుడు వస్తున్న గ్రాస్ మొత్తం తమిళనాడు నుండి వస్తున్నవే. నిన్న ఈ చిత్రానికి దాదాపుగా 5 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఇప్పటి వరకు తమిళనాడు ప్రాంతం లో ఈ చిత్రానికి 117 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ రాష్ట్రం నుండి 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది ఈ వీకెండ్ తోనే తేలనుంది. ఓవర్సీస్ లో 56 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కర్ణాటక లో 12 కోట్ల 30 లక్షలు, కేరళలో 3 కోట్ల 20 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
Also Read : గుడ్ బ్యాడ్ అగ్లీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు వెర్షన్ కూడా కుమ్ముతుందిగా!