Good Bad Ugly Collections : తమిళ హీరో అజిత్ కుమార్(Thala Ajith Kumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని భారీ ఓపెనింగ్స్ ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఓపెనింగ్స్ అయితే భారీగానే వచ్చాయి కానీ, వర్కింగ్ డేస్ మాత్రం ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లను మాత్రమే సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సూపర్ హిట్ రేంజ్ లోనే వసూళ్లు ఉన్నాయి కానీ, ఓపెనింగ్స్ కి తగ్గట్టుగా లేవు. అంతే కాకుండా తన తోటి స్టార్ హీరో అయినటువంటి విజయ్ ‘గోట్’ మూవీ వసూళ్లకు ఈ చిత్రం దరిదాపుల్లోకి కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఆరు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read : రామ్ చరణ్ ని అవమానించిన తమన్నా..కనీసం గుర్తించలేదంటూ అభిమానులు ఫైర్!
ఈ సినిమాకు తమిళ వెర్షన్ వసూళ్లు భారీ రేంజ్ లోనే ఉన్నప్పటికీ, తెలుగు వెర్షన్ లో మాత్రం ఓపెనింగ్స్ ని చూసి కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ మౌత్ టాక్ బాగా వ్యాప్తి చెందడంతో తెలుగు వెర్షన్ వసూళ్లు బాగా పుంజుకున్నాయి. నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ దాదాపుగా 20 లక్షల వరకు ఉండొచ్చు. సినిమాలు పెద్దగా ఏమి లేకపోవడం తో మూవీ లవర్స్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని తమ మొదటి ఛాయస్ గా ఎంచుకుంటున్నారు. అందుకే తెలుగు వెర్షన్ వసూళ్లు స్టడీ గా ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది. ఈ వీకెండ్ లో కాస్త హోల్డ్ ని చూపించగలిగితే కచ్చితంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవచ్చు.
ఇక తమిళనాడు ప్రాంతంలో ఈ చిత్రానికి మొదటి ఆరు రోజులకు కలిపి 107 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో ఇక్కడ 200 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందా లేదా అనేది ఈ వీకెండ్ వసూళ్లను బట్టి చెప్పొచ్చు. ఇప్పటి వరకు విజయ్ తప్ప మరో హీరోకి తమిళనాడు ప్రాంతం లో 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాలేదు. ‘జైలర్’ చిత్రం కూడా చాలా దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. అదే విధంగా కర్ణాటక ప్రాంతంలో 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళలో మూడు కోట్ల రూపాయిల, ఓవర్సీస్ లో 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 183 కోట్ల రూపాయిల గ్రాస్, 90 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది.