Power Star Emotional Fans: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకువచ్చి పెట్టడమే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనటువంటి ఒక గొప్ప ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన నుంచి రాబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు…’పవన్ కళ్యాణ్’ రీసెంట్ గా ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు. ఇక ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ అభిమాని అయిన ‘నివేతా’ అనే అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగింది. రీసెంట్గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ని ఎవరైనా తిడితే తట్టుకోలేనని, ఇంట్లో అన్నం కూడా తినేది కాదని ఏడుస్తూ కూర్చునే దాన్ని అంటు ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక తను అలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ ని అలా చాలా మంది దూషిస్తారు. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి ఆయనంటే నచ్చని వారు అలాంటి కామెంట్ చేస్తూనే ఉంటారు. దానివల్ల నువ్వు తినకుండా కూర్చుంటే ఏమోస్తుంది అంటూ తనకి సర్ది చెప్పే వారట. ఇక పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చిన సమయం నుంచి ఆమె పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తుందట. తన సర్కిల్ లో ఉన్న వాళ్లందరికి ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో తెలుసట… ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ని తిడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుందట. ఆయన కోసం ఆమె డిబేట్ పెట్టుకోవడానికి రెడీగా ఉంటుందట. తన క్లోజ్ రిలేషన్స్ సైతం పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా మాట్లాడితే వాళ్లతో గొడవ పెట్టుకుందట…
Also Read: టాలీవుడ్ లో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పెద్ద సెంటిమెంట్…
ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని ఆయన ఎలక్షన్స్ లో గెలిచిన సందర్భంలో ఏం చేసానో కూడా తనకు తెలియదని వర్షం పడుతుంటే వర్షం లోకి వెళ్లి హాయిగా అతని గెలుపుని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయానని చెబుతోంది. మరి ఏది ఏమైనా కూడా ఆమెకి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగే అవకాశం అయితే ఓవర్ నైట్ లో రాలేదట…
పవన్ కళ్యాణ్ కోసం తను చాలా వరకు కష్టపడ్డానని, పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవమని, ఇప్పుడున్న ప్రస్తుత పాలిటిక్స్ లోకి పవన్ కళ్యాణ్ రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్పింది. నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు. అందువల్లే ఆయన గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. మొత్తానికైతే ఆయన రాజకీయరంగంలో చాలా ముందుకు దూసుకెళ్తున్నాడు.
Also Read: పవన్ బిజీలో.. ‘ఓజీ’ కోసం సుజిత్ కష్టాలు మామూలుగా లేవు…
రాబోయే కాలంలో అతను సీఎం అవుతాడు అనేది పక్కా కాబట్టి ఆయన జనం కోసం పని చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల సినిమాలను పక్కనపెట్టి ఫుల్ బిజీగా మారిపోతున్నాడు…ఇక బయటికి తెలిసిన లేడీ అభిమాని నవిత ఒక్కరే కానీ తెలియకుండా పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తూ ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు చాలామంది ఉన్నారు…