https://oktelugu.com/

అమ్మాయి మోసం చేసింది.. బెస్ట్ కమెడియన్ అయిపోయాడు !

జబర్ధస్త్ తో చాలామంది కమెడియన్స్ కు లైఫ్ వచ్చింది. అలా పాపులారిటీని సొంతం చేసుకుని కమెడియన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త‌న విజ‌య ర‌హ‌స్యం గురించి చెప్పుకొచ్చాడు. తాను భ‌గ్న‌ప్రేమికుడిన‌ని.. తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ప్రేమ‌లో పడ్డానని.. పైగా పెద్ద‌ల అంగీకారంతో ఇద్దరం పెళ్లాడాల‌నుకున్నామ‌ని.. కానీ, తాను ప్రేమించిన అమ్మాయి తనను వదిలి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు. ఆ స‌మ‌యంలో పిచ్చివాడిలా మారిపోయిన తానూ మళ్లీ తేరుకుని.. ఆ అమ్మాయి […]

Written By:
  • admin
  • , Updated On : December 12, 2020 / 02:30 PM IST
    Follow us on


    జబర్ధస్త్ తో చాలామంది కమెడియన్స్ కు లైఫ్ వచ్చింది. అలా పాపులారిటీని సొంతం చేసుకుని కమెడియన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త‌న విజ‌య ర‌హ‌స్యం గురించి చెప్పుకొచ్చాడు. తాను భ‌గ్న‌ప్రేమికుడిన‌ని.. తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ప్రేమ‌లో పడ్డానని.. పైగా పెద్ద‌ల అంగీకారంతో ఇద్దరం పెళ్లాడాల‌నుకున్నామ‌ని.. కానీ, తాను ప్రేమించిన అమ్మాయి తనను వదిలి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు. ఆ స‌మ‌యంలో పిచ్చివాడిలా మారిపోయిన తానూ మళ్లీ తేరుకుని.. ఆ అమ్మాయి అసూయ ప‌డేలా ఎద‌గాల‌నే ప‌ట్టుద‌ల త‌న‌లో పుట్టింద‌ని.. ఆ రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని అవినాష్ తన ప్రేమ విఫల కథ గురించి చెప్పాడు.

    Also Read: అప్పటి సీక్రెట్స్ : సిల్క్ స్మితతో ప్రొడక్షన్ బాయ్స్ నుండి సూపర్ స్టార్స్ వరకూ.. !

    ప్ర‌తి మ‌గాడి ఎదుగుద‌ల వెనుక ఓ మ‌హిళ ఉందంటారు. ఆ విధంగానే అవినాశ్ ఆర్టిస్ట్‌గా ఎద‌గ‌డం వెనుక మోసం చేసిన ఓ ప్రేమికురాలు ఉంద‌న్న మాట‌. ఇక ఎన్నో స్కిట్లలో నవ్వించిన అవినాష్.. వైల్డ్ కార్డ్ ద్వారా జోకర్ గెటప్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించి బాగానే ఆకట్టుకున్నాడు. నిజానికి ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన కామెడీ మార్క్ తో బాగానే ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడు. కేవలం అవినాష్ కామెడీ సెన్స్ వల్లే చాలా వారాల పాటు అతను నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడంటేనే అర్ధం చేసుకోవచ్చు మనోడి కామెడీ రేంజ్ ఏంటో. బిగ్ బాస్ కూడా తరచూ ఏదో ఒక గొడవతో మూసగా సాగిపోతుందనే అపవాదును కూడా అవినాష్ నే పోగొట్టాడు.

    Also Read: బిగ్ బాస్ : పెద్ద తప్పు చేసిన అభిజీత్.. మంచి ఛాన్స్ మిస్ !

    ఏది ఏమైనా హౌస్ నుండి బయటికి వచ్చిన అవినాష్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలు, కంటెస్టెంట్స్ ప్రవర్తన వంటి అనేక విషయాలపై తన అభిప్రాయం తెలియజేస్తూ.. మొత్తానికి మనోడు వైరల్ అవ్వడానికి ముందుగానే పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఇంటి నుండి బయటికి వచ్చిన అవినాష్ కి నాగార్జున గిఫ్ట్ గా ఒక షర్ట్ ఇచ్చాడట. నాగ్ ఇచ్చిన ఆ షర్ట్ ధరించి సోషల్ మీడియాలో పోజులిచ్చాడు కూడా ఈ యంగ్ కమెడియన్. నాగార్జున లాంటి స్టార్ తన కోరిక మన్నించి తనకు షర్ట్ గిఫ్ట్ గా ఇవ్వడాన్ని గొప్పగా ఫీలవుతూ ఈ విషయాన్ని నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్