Ghaati Collection Day 2: సరైన కంటెంట్ ఇవ్వకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా ఆడియన్స్ మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి రీసెంట్ సమయం లో చాలా పెద్ద సినిమాలు ఉదాహరణగా నిలిచాయి. ఆ జాబితా లో ఇప్పుడు ‘ఘాటీ'(Ghaati Movie) చిత్రం కూడా చేరిపోయింది. అనుష్క శెట్టి(Anushka shetty) చాలా కాలం తర్వాత ఈ సినిమాతో వెండితెర పై కనిపించింది. టీజర్, ట్రైలర్ తో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని రగిలించింది ఈ చిత్రం. అబ్బో పర్లేదే, డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) తన మేకింగ్ స్టైల్ ని పక్కన పెట్టి కొత్తగా ఈ చిత్రం తో ప్రయత్నం చేశాడే అని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ థియేటర్ కి వెళ్తే కానీ అర్థం అవ్వలేదు, ఆయన మేకింగ్ స్టైల్ అసలు ఏమాత్రం మారలేదు, ఇంకా దిగజారింది అని. అనుష్క ని పవర్ ఫుల్ గా చూపించడం కోసం ఆయన పెట్టిన శ్రద్దలో సగం స్క్రిప్ట్ మీద పెట్టుంటే ఈరోజు ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు నెటిజెన్స్.
ఈ సినిమా కోసం అనుష్క శెట్టి దాదాపుగా 12 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంది. సినిమాకు రెండు రోజులకు కలిపి కనీసం 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. ప్రతీ చిత్రానికి ప్రాంతాల వారీగా స్పష్టమైన బ్రేకప్ వస్తుంది. కానీ ఈ సినిమాకు అలా రాలేదు. ఎందుకంటే ప్రాంతాల వారీగా చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు కాబట్టి. అనుష్క సినిమా అంటే మినిమం గ్యారంటీ రేంజ్ వసూళ్లు ఉంటాయి. కానీ ఈ సినిమాకు ఇంతటి దారుణమైన ఓపెనింగ్స్ వస్తాయని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆమె తీసుకున్న 12 కోట్ల రెమ్యూనరేషన్ లో ఒకటవ వంతు వసూళ్లు కూడా క్లోజింగ్ లో వచ్చేలా కనిపించడం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పాతిక కోట్ల రూపాయిలు ఉన్నాయి.
అంటే దాదాపుగా 80 శాతం కి పైగా నష్టాలను చూడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట. ఇక ఓవర్సీస్ పరిస్థితి చూస్తే నిర్మాతకు కళ్ళలో నుండి నెత్తురు కారుద్ది. మొదటి రోజు కేవలం ప్రీమియర్ షోస్ తో కలిపి కేవలం 45 వేల డాలర్లు వచ్చిందట. దీనిని బట్టి ఈ చిత్రం ఏ రేంజ్ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అనేది మీరే అర్థం చేసుకోండి. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాతో తన కెరీర్ కి తానే శుభం కార్డు వేసుకున్నట్టే. పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ లాంటి ప్రాజెక్ట్ ని మధ్యలోనే అనాధ లాగా వదిలేసి వచ్చి ‘ఘాటీ’ మూవీ చేస్తుంటే ఎదో గొప్ప సినిమా తీస్తున్నాడని అంతా అనుకున్నారు. తీరా చూస్తే కళ్ళు పేలిపోయే రేంజ్ సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ మాత్రం దానికి ఇంత బిల్డుప్ ఎందుకు?, కుదురుగా హరి హర వీరమల్లు చేసుంటే ఫలితం వేరేలా ఉండేదేమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.