Bigg Boss Season 9: అలేఖ్య చిట్టి పికిల్స్ .. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ అయిన పేరు ఇది. కంచర్ల రమ్య మోక్ష అనే అమ్మాయి తన సోదరీమణులు కంచర్ల సుమ, కంచర్ల అలేఖ్యతో పికిల్స్ వ్యాపారం చేస్తోంది. ఆ మధ్య కెరియర్ మీద ఫోకస్ పెట్టు అనే వీడియో ద్వారా ఈ ముగ్గురు సోదరీమణులు విపరీతంగా పాపులర్ అయ్యారు. అదే సమయంలో ట్రోల్ కూడా అయ్యారు. కొద్దిరోజుల వరకు వీరి మీద విపరీతమైన నెగిటివిటీ ప్రచారం కావడంతో పచ్చళ్ల వ్యాపారాన్ని నిలుపుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడే వీరి వ్యాపారం పుంజుకుంటున్నది. ఇక ఈ ముగ్గురు సోదరీమణుల్లో సుమ ఇన్ ఫ్లూయన్సర్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.
సినిమాకి వెళ్తే..
రమ్యకు బిగ్ బాస్ -9 లో అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. షో కు వెళ్లే వారిలో రమ్య పేరు ఉందని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే ఆమెకు ఇప్పట్లో అవకాశం రాదని.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశం లభిస్తుందని తెలుస్తోంది.. ఈనెల 28న బిగ్ బాస్ 9 2.0 గ్రాండ్ లాంచింగ్ కింద ఆమెను షో లోకి పంపిస్తారని తెలుస్తోంది.. ఈ విషయాన్ని పక్కన పెడితే సుమ ఇటీవల తన పెళ్లి రోజు కావడంతో భర్త, సోదరీమణులతో కలిసి సినిమాకు వెళ్ళింది. అక్కడ కూర్చొని సినిమా చూస్తుంటే వెనకనుంచి కొంతమంది యువకులు అసభ్యకరంగా మాట్లాడారు.. సినిమాకు రావాలంటే సామాన్లు బాగుండాలి ఆంటీ అని చండాలంగా మాట్లాడారు. సినిమా ఇంటర్వెల్ సమయంలో క్యాంటీన్ కు వెళ్లి కూల్డ్రింక్స్ తెచ్చుకుంటుంటే.. కొంతమంది వచ్చి చెత్తగా సైగలు చేశారు. వారిని చూస్తే చెంప పగలగొట్టాలి అనిపించింది. సినిమా మధ్యలో నుంచి వెళ్లిపోవాలి అనిపించింది. కానీ న్యూసెన్స్ అవుతుందని ఊరుకున్నామని సుమ తన యూట్యూబ్ చానల్లో వాపోయింది.
ఈ తతంగం మొత్తం చూసిన రమ్య వెంటనే దిశ యాప్ లో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు బెదిరిస్తుంటే వారంతా కూడా సుమ సోదరీమణుల కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడ లేదు. “మాకు తెలిసింది పచ్చళ్ళ వ్యాపారం మాత్రమే. మా ధర నచ్చితే కొనుక్కుంటారు. నచ్చకపోతే ఊరుకుంటారు. అంత తప్ప మేము ఎవరిని మా దగ్గర కొనాలి అని అడగడం లేదు కదా. అడ్డగోలుగా మాట్లాడటం లేదు కదా. చెత్త వీడియోలు పోస్ట్ చేస్తూ డబ్బులు అడగడం లేదు కదా.. మా బతుకు మేం బతుకుతుంటే ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకని” సుమ వాపోయింది. ఇక క్రితం వీడియోలో సుమ తన భర్త ఎవరో చెప్పింది. ఆమె, తన భర్త మాట్లాడుకున్న సరదా వీడియోను ఛానల్ లో పోస్ట్ చేసింది. యూట్యూబ్లో సుమకు 4 లక్షల పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.
