Little Hearts Collection Day 2: ‘మౌళి టాక్స్'(Mouli Talks) అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజెన్స్ అందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి మౌళి. మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఈ కుర్రాడు, చిన్న వయస్సులోనే స్టాండప్ కమెడియన్ గా బయట ఎన్నో వందల ఈవెంట్స్ కూడా చేసాడు. అలా జనాల్లో పాపులారిటీ ని తెచ్చుకున్న ఈయన ఈటీవీ విన్ యాప్ లో ’90s’ అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యాడు. ఆ తర్వాత అదే ఈటీవీ విన్ యాప్ వారు ఇతనితో ఒక ఫీచర్ ఫిలిం తీయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అదే రీసెంట్ గా విడుదలైన ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts). ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా చిన్న సినిమా అనే ముద్ర తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ప్రభంజనమే సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రెండవ రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో అక్షరాలా 1 లక్షా 52 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 3 కోట్ల రూపాయలకు జరగ్గా, రెండు రోజుల్లో 3 కోట్ల 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే అప్పుడే 67 లక్షల రూపాయిల లాభం వచ్చింది అన్నమాట. తెలుగు రాష్ట్రాల నుండి మొదటి రోజు ప్రీమియర్ షోస్ తో కలిపి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, రెండవ రోజు కోటి 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోకులకు 2 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు, అదే విధంగా మొదటి రెండు రోజులకంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లను రాబడుతూ పెట్టిన ప్రతీ పైసాకి పదింతలు లాభాలు చూపిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు నెలకొల్పుతుందో చూడాలి. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 6 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. వర్కింగ్ డేస్ లో కూడా ఇదే రేంజ్ హోల్డ్ ని చూపించగలిగితే ఫుల్ రన్ లో 20 కోట్ల షేర్ ని రాబట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.