https://oktelugu.com/

Getup Srinu- Mukku Avinash: గెటప్ శ్రీనుకు జబర్దస్త్ కి అందుకే గ్యాప్ వచ్చింది… అసలు విషయం చెప్పిన ముక్కు అవినాష్

Getup Srinu- Mukku Avinash: స్టార్ కమెడియన్స్ ఒక్కొక్కరు జబర్దస్త్ ని వీడుతుండగా షో మునుపటి కళ కోల్పోతుంది. ఎవరు పోయినా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్స్ ఉన్నంత వరకు జబర్దస్త్ కి ఢోకా లేదనుకుంటే వీరు కూడా షోకి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆది ఐదారు వరాలుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఇక సుడిగాలి సుధీర్ టీమ్ లో ఆటో రాంప్రసాద్ ఒక్కడే మిగిలాడు. సుధీర్, గెటప్ శ్రీను […]

Written By:
  • Shiva
  • , Updated On : June 2, 2022 / 12:27 PM IST
    Follow us on

    Getup Srinu- Mukku Avinash: స్టార్ కమెడియన్స్ ఒక్కొక్కరు జబర్దస్త్ ని వీడుతుండగా షో మునుపటి కళ కోల్పోతుంది. ఎవరు పోయినా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్స్ ఉన్నంత వరకు జబర్దస్త్ కి ఢోకా లేదనుకుంటే వీరు కూడా షోకి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆది ఐదారు వరాలుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఇక సుడిగాలి సుధీర్ టీమ్ లో ఆటో రాంప్రసాద్ ఒక్కడే మిగిలాడు. సుధీర్, గెటప్ శ్రీను లేకుండా ఆయన స్కిట్స్ చేస్తున్నారు. ఒక్కసారిగా జబర్దస్త్ ఇలా ఖాళీ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.

    Getup Srinu

    2019లో నాగబాబు షో నుండి బయటికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ డైరెక్టర్స్ తో పాటు తనకు సన్నిహితులైన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి కమెడియన్స్ ని తీసుకెళ్లారు. అయినప్పటికీ జబర్దస్త్ రేటింగ్ దెబ్బ తినలేదు. అయితే క్రమంగా ఒక్కొక్కరు ఆ షోని వీడుతున్నారు. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ముక్కు అవినాష్ జబర్దస్త్ మానేసి విషయం తెలిసిందే. అగ్రిమెంట్ బ్రేక్ చేసి బిగ్ బాస్ కి వెళ్లినందుకు జబర్దస్త్ మేకర్స్ కి రూ.10 లక్షలు చెల్లించినట్లు అవినాష్ తెలిపాడు.

    Also Read: Sunny Leone: సెక్స్ వర్కర్ కు ఫోర్న్ స్టార్ కు మధ్య తేడా ఏంటి..? సన్నీ లియోన్ సంచలన సమాధానం

    కాగా తాజా ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ గెటప్ శ్రీను జబర్దస్త్ లో కనిపించకపోవడానికి కారణం తెలిపాడు. ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.. గెటప్ శ్రీను అన్న ఓ సినిమా విషయంలో బిజీగా ఉన్నారు. ఆ కారణంగా జబర్దస్త్ కి ఆయనకి చిన్న గ్యాప్ వచ్చింది. నాకు తెలిసిన సమాచారం అయితే అది, అని తెలియజేశారు. ముక్కు అవినాష్ మాటల ప్రకారం… డేట్స్ కుదరక పోవడం వలన జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. అంతే కానీ గెటప్ శ్రీను షో మానేయలేదని తెలుస్తుంది.

    Getup Srinu

    కమెడియన్ గా గెటప్ శ్రీను సినిమాల్లో బిజీ అయ్యారు. అలాగే ఆయన హీరోగా రాజు యాదవ్ పేరుతో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ కారణంగానే గెటప్ శ్రీను జబర్దస్త్ షో చేయడం లేదని చెప్పవచ్చు. అందులోనూ జబర్దస్త్ కి కేటాయించే సమయంతో సినిమాలు, ఇతర షోల ద్వారా ఎక్కువ సంపాదించవచ్చు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది జబర్దస్త్ కి దూరం కావడానికి కూడా ఇవే కారణాలుగా చెప్పవచ్చు. సుడిగాలి సుధీర్ హీరోగా సినిమాలు చేస్తుండగా, హైపర్ ఆది కమెడియన్ గా బిజీ అయ్యారు.

    Also Read:
    Ravi Teja Remuneration: ఏంటీ రవితేజకు డబ్బు పిచ్చిపట్టిందా?
    Recomended Videos


    Tags