CM KCR- Nikhat Zareen- Esha Singh: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో పడిపోయింది. దీంతో డబ్బు కష్టాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయనున్నాయి. మరోవైపు కేంద్రం అప్పు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతుండటంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంలో పడింది. డబ్బు కష్టాలు తీరాలంటే అప్పు పుట్టాల్సిందే. లేకపోతే ఇక మరో మార్గం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. కానీ సాయం చేయడంలో మాత్రం కేసీఆర్ తన వైఖరి చూపిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు రూ. 2 కోట్లు చొప్పున ఇద్దరికి నాలుగు కోట్లు నజరానా ప్రకటించారు. దీంతో అసలే ఆర్థిక కష్టాల్లో ఉంటే నజరానాలు ప్రకటిస్తూ ఏం చేయనున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.
మహిళల వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్, ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ చాంపియన్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఇషా సింగ్ కు చెరో రూ. 2 కోట్లు నజరానా ఇచ్చేందుకు నిర్ణయించింది. వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పింది. దీంతో కేసీఆర్ వారికి బహుమతులు ప్రకటించి తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని చెబుతున్న సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
నిఖత్ జరీన్ మహిళల ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో ఇండోనేషియాకు చెందిన జుటామన్ జెట్ సాంగ్ పై 52 కేజీల విభాగంలో గెలిచి స్వర్ణం సాధించింది. ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన ఐదో మహిళగా జరీన్ గుర్తింపు పొందింది. ఇటీవల జర్మనీలో జరిగిన చాంపియన్ షిప్ పోటీల్లో ఇషా సింగ్ మూడు స్వర్థ పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. దీంతో ఇద్దరికి నజరానా ప్రకటించింది. క్రీడలను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
కేసీఆర్ నజరానా ప్రకటించముందే క్రీడాకారులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి సెల్ఫీలు దిగారు. ప్రధానితో కలిసి సందడి చేశారు. కానీ ప్రధాని మాత్రం ఏ సాయం ప్రకటించకపోవడంతో సీఎం కేసీఆర్ వారిని ప్రోత్సహించేందుకు నజరానా ప్రకటించి కేంద్రం చేయని పని మేం చేశామని చెప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహమేమిటో అర్థం కావడం లేదు. క్రీడాకారులను ప్రోత్సహించి మరిన్ని పతకాలు సాధించేందుకు దోహదపడతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
తెలంగాణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమే కానుంది. అప్పు ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకోకపోవడంతో ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ దుర్భర పరిస్థితిలో కూడా సీఎం నజరానాల పేరుతో డబ్బు పంపిణీ చేసేందుకు నిర్ణయించుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే మార్గాలు మాత్రం కనిపించడం లేదు. కేసీఆర్ మాత్రం డబ్బులు పంపిణీ చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కావాలనే కేంద్రంపై అక్కసుతో నజరానా ప్రకటించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Bigg Boss 6 Telugu: షాకింగ్ ట్విస్ట్… మామ స్థానంలో మాజీ కోడలు!