Geetu Royal: బిగ్ బాస్ హిస్టరీలో ఒక కంటెస్టెంట్ హౌస్ నుండి వెళ్లిపోతుంటే ఆడియన్స్ బాగా ఎమోషనల్ అవ్వడం మనం ఇంతవరుకు ఎప్పుడు చూడలేదు..కానీ అది గీతూ విషయం లో చూసాము..హౌస్ లోకి వచ్చినరోజు నుండి వెళ్లే వరుకు ప్రేక్షకులకు వినోదం తో పాటు మంచి కంటెంట్ ని ఇచ్చిన గీతూ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుందని అనుకున్నారు..కానీ చివరికి టాప్ 10 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కూడా నిలవలేకపోవడం ఆమెని తీవ్రమైన షాక్ కి గురి చేసింది.

హౌస్ ని వదిలి వెళ్లలేక వెక్కిళ్లు పెట్టి ఆమె ఏడవడాన్ని చూసి ఇంటి సభ్యులతో పాటుగా ప్రేక్షకులు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు..ఈ ఎపిసోడ్ కి అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ కూడా వచ్చాయి..అయితే గీతూ ఇప్పటికి కూడా తన ఎలిమినేషన్ ని జీర్ణించుకోలేక పోతుంది..విన్నర్ అవుదామని వచ్చిన ఆమె కనీసం రన్నర్ గా మిగిలిన ఆనందపడేదేమో కానీ కనీసం టాప్ 10 స్థానం లో కూడా లేకపోవడం ఇక ఆమె జీవితం లో మర్చిపోలేదట.
ఇప్పుడు లేటెస్ట్ గా గీతూ టీం ఆమె తరుపున ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ ఖాతాలలో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది..’గీతూ ఇప్పటికి బాధలోనే ఉంది..ఆమె అసలు ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని కలలో కూడా ఊహించలేదు..అందుకే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది..మళ్ళీ ఆమె మాములు మనిషి అవ్వడానికి సమయం పడుతుంది..తన ప్రైవేట్ స్పేస్ తనకి ఇద్దాము..అతి త్వరలోనే ఆమె మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది..గీతూ గారు మొదట్లో అర్థం అవ్వడానికి కాస్త కష్టమే..కానీ ఒక్కసారి ఆమెని అర్థం చేసుకుంటే..మనం తనలో ఏంజిల్ ని చూడొచ్చు..తన ఉద్దేశ్యాలన్ని కూడా అద్భుతమైనవి..కానీ వాటిని ఎలా ప్రెజెంట్ చెయ్యాలి అనేది తెలియదు..ఆమె బిగ్ బాస్ ప్రయాణం ని మొదటి నుండి సపోర్టు చేస్తూ 9 వారాలపాటు సపోర్టు చేసిన ఫాన్స్ కి ధన్యవాదాలు’ అంటూ గీతూ టీం పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

ఎలిమినేట్ అయిపోతే నేను అండమాన్ కి వెళ్ళిపోయి కొన్ని రోజులు ఒంటరిగా గడుపుతాను అంటూ గీతూ హౌస్ లో ఉన్నప్పుడు చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆమె అక్కడికే వెళ్లబోతుందని సమాచారం.