Bigg Boss 6 Telugu Surya: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లోకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..గత వారం కెప్టెన్సీ టాస్కు రద్దు చెయ్యడం వల్ల ఇంటికి కెప్టెన్ ఎవ్వరు లేకపోవడం తో ఇమ్మ్యూనిటి పొందే ఇంటి సభ్యులు ఎవ్వరు లేరు కాబట్టి అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు..ప్రతి వారం లో లాగానే ఈ వారం కూడా రేవంత్ అందరికంటే అత్యధిక ఓట్లతో టాప్ 1 లో కొనసాగగా,శ్రీహాన్ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు.

ఇక ఎవ్వరు ఊహించని విధంగా మీరిన తన ఆట తీరు బాగా మెరుగు పర్చుకోవడం తో ఆమె ఇప్పుడు టాప్ 5 స్థానం లో కొనసాగుతుంది..కానీ ప్రతి వీకెండ్ లో లాగ కాకుండా ఈ వారం ఒక్కరిగా సేవ్ చెయ్యకుండా నేరుగా సూర్య లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చెయ్యడం అందరిని షాక్ కి గురి కి చేసింది.
గత వారం లో జరిగిన ఎలిమినేషన్ కూడా ఇలాంటిదే..అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్ హౌస్ మేట్స్ తో పాటుగా ప్రేక్షకులను కూడా షాక్ కి గురి చేసింది..ఇలా బిగ్ బాస్ వరుసగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తున్నాడు కాబట్టే TRP రేటింగ్స్ అంత దారుణంగా పడిపోయాయి అంటున్నారు విశ్లేషకులు..అయితే సూర్య ఎలిమినేషన్ లో పెద్ద ట్విస్ట్ ఉండొచ్చు అని ఇంటి సభ్యులతో పాటుగా ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉన్నారు..సూర్య ని సీక్రెట్ రూమ్ లోకి పంపించే అవకాశం ఉందని చెప్తున్నారు..గత సీసన్స్ లో కూడా ఇలాగే చేసారు..అయితే ఈమధ్య బిగ్ బాస్ అందరూ ఊహించేటట్టుగా ఏ పని చెయ్యడం లేదు కాబట్టి నిజంగానే ఎలిమినేట్ అయ్యాడనే కొంతమంది అంటున్నారు..మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే రేపటి వరుకు వేచి చూడాల్సిందే.

అయితే ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యులు స్టేజి మీదకి వచ్చిన తర్వాత చివరిసారిగా ఇంటి సభ్యులందరితో మాట్లాడించి పంపుతారు..కానీ సూర్య విషయం లో అది జరగలేదు కాబట్టి కచ్చితంగా సీక్రెట్ రూమ్ కి పంపి ఉంటారు అని అనుకుంటున్నారు..కానీ ఈరోజు ఎపిసోడ్ కి సమయం అయిపోయింది కాబట్టి..రేపు ఎపిసోడ్ ప్రారంభం లోనే సూర్య ని ఇంటి సభ్యులందరితో మాట్లాడించి పంపిస్తారని తెలుస్తుంది..చూడాలి మరి రేపు ఏమి జరుగుతుంది అనేది.