https://oktelugu.com/

Geetha Madhuri- Nandu: గీతామాధురి, నందు విడాకులు తీసుకుంటున్నారా?

నందు హీరోగా, సహాయ పాత్రల్లో రాణిస్తూ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. అంతేకాదు రీసెంట్ గా రష్మి హీరోయిన్ గా నందు హీరోగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆ సినిమా పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 20, 2023 / 12:54 PM IST

    Geetha Madhuri- Nandu

    Follow us on

    Geetha Madhuri- Nandu: వేలాది మందికి తన గొంతు తెలుసు.. ఆమె పాట వచ్చిందంటే హాయిగా వింటూ ఉంటారు. మరికొన్ని పాటలు వింటే చిందులు వేయకుండా ఉండరు. క్లాస్, మాస్ పాటలు పాడుతూ శ్రోతలను అలరించడంలో ముందుంటుంది సింగర్ గీతా మాదురి. తన పాటలతో ఎంతో మందిని అలరించింది ఈ గానకోయిల. అయితే మాధురి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు నందూను ప్రేమ వివాహం చేసుకొని సంతోషంగా ఉంటుంది అనుకునే సమయంలో వీరి విడాకుల గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

    ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. అయితే గత రెండేళ్ల నుంచి గీతామాధురి నందు ఇద్దరు విడిపోతున్నారని,వీరి మధ్య గొడవలు రావడం వల్ల గీత మాధురి తన పాపని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందని,నందు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడని, అందుకే ఇద్దరు కలిసి ఏ ఫంక్షన్ లో కూడా జంటగా కనిపించడం లేదు అని ఇలా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

    అయితే నందు హీరోగా, సహాయ పాత్రల్లో రాణిస్తూ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. అంతేకాదు రీసెంట్ గా రష్మి హీరోయిన్ గా నందు హీరోగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆ సినిమా పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. ప్రస్తుతం మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నెగటివ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు నందు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి నందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విడాకులు రూమర్లకు చెక్ పెట్టేశారు.

    గత రెండు సంవత్సరాల నుంచి మేము విడిపోతున్నాం అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలాగే మేము చాలా రోజుల నుంచి రియాల్టీ షోలకి కూడా వెళ్లడం లేదన్నారు. కానీ మేము విడిపోతున్నాం అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఇవి పుకార్లు మాత్రమే అని కుండ బద్దలు కొట్టాడు. దీంతో ఇన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేశారు నందు.